28.7 C
Hyderabad
April 28, 2024 10: 28 AM
Slider ప్రపంచం

అమెరికా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు

trump

యూఎస్ ప్రభుత్వ అధీనంలోని వెబ్ సైట్ ను ఇరాన్ కు చెందిన హ్యాకర్లు, హ్యాక్ చేశారు. ఆ వెబ్ సైట్ హోమ్ పేజీలో, అధ్యక్షుడు ట్రంప్ ను రక్తం వచ్చేలా కొడుతున్న ఓ మార్ఫింగ్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. యూఎస్ ఫెడరల్ డిపాజిటరీ లైబ్రరీ ఈ వెబ్ సైట్ ‘www.fdlp.gov’ ను నిర్వహిస్తోంది. దీన్ని శనివారం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ వెబ్ సైట్ లో “దేవుడి ప్రేరణతో, ఇరాన్ సైబర్ సెక్యూరిటీ గ్రూప్ హ్యాకర్స్… ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేశాం” అని కామెంట్ పెట్టారు. తాము అనునిత్యమూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ వెబ్ సైట్ ప్రభుత్వ ప్రచురణలను ఉచితంగా ప్రజలకు అందిస్తుంది. ఖాసీమ్ సులేమాని హత్యకు వ్యతిరేకంగా ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు హ్యాకర్లు తెలిపారు.

Related posts

ప్రభుత్వ రంగ సంస్థలను,ప్రజలను రక్షించుకుందాం

Satyam NEWS

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ డిప్యూటీ మంత్రుల ప్రకటన

Sub Editor

బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్ నమోదు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment