27.7 C
Hyderabad
April 26, 2024 05: 34 AM
Slider జాతీయం

బీహార్ లో బిజెపికి రానున్నది గడ్డు కాలమే

laluprasad

ఈ ఏడాది జరగబోతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి శృంగభంగం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడ్డి కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పవనాలు విస్తరిస్తున్నాయని కూడా మరో అంచనా ఉంది.

ఇదే జార్ఖండ్ ఎన్నికలలో కూడా పని చేసి బిజెపిని కట్టడి చేసింది. బీహార్ లో ప్రస్తుతం దళిత, ముస్లిం వర్గాల ఐక్యత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని వార్తలు వెలువడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ ఆర్ సిలకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతటా ముస్లింలు చైతన్యవంతంగా మారారని కూడా సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

దోహజార్ బీస్ హటావో నితిష్ (2020 నితిష్ ను తొలగించు) అంటూ రాంచి జైలు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చి నిన్నటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. లాలూ పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. దళిత ముస్లిం ఐక్యత ను సాధించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది.

ఇది నితిష్ కుమార్ కు శాపంగా మారింది. బిజెపి కి ఇప్పుడు కేవలం అగ్ర కులాలు మాత్రమే మద్దతు ఇస్తున్నాయి. లార్ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ ఎన్నికల నుండి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. దళిత ముస్లిం ఐక్యత బీహార్‌లోని ప్రతి ఒక్కరికీ షాక్ ఇస్తుంది.

ఇది నితీష్ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేయబోతున్నట్లు కూడా అంచనాలు ఉన్నాయి.  చంద్రశేఖర్ ఆజాద్ భీమ్ ఆర్మీ, ఒవైసీ మజ్లిస్ పార్టీ మిత్రపక్షాలు. వీరంతా కాంగ్రెస్ తో కలిస్తే ఇక బిజెపి, నితిష్ ల ఓటమి దాదాపుగా ఖాయమైనట్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన కిషన్ గంజ్ కి ఇప్పుడు మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నది. మజ్లీస్ తో పొత్తు కోసం  ఈ నియోజకవర్గాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. 

ఒవైసీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మంజీతో కూడా పొత్తు పెట్టుకుంటున్నారు.  అంతకుముందు ఈ నియోజకవర్గంలో ర్యాలీకి చంద్రశేఖర్ ఆజాద్ కూడా హాజరయ్యారు.  ఎన్నికల ఎత్తుగడలపై ఈ కూటమి చర్చలు ప్రారంభించినట్లు మజ్లిస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం కూడా ఎన్డీఏ ను ముందుకు సాగనివ్వవని సర్వేలు సూచిస్తున్నాయి.

Related posts

గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలల్లో కీచక టీచర్లు

Satyam NEWS

మహాత్ముడికి కరీంనగర్ పోలీసుల ఘన నివాళి

Satyam NEWS

కొల్లాపూర్ లో గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరం

Satyam NEWS

Leave a Comment