40.2 C
Hyderabad
May 6, 2024 18: 33 PM
Slider హైదరాబాద్

వత్తిడికి గురికాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి

#amberpetmla

విద్యార్థినీ విద్యార్థులు మంచి ఉత్తీర్ణతో పరీక్షల్లో విజయం సాధించాలని, ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్ పెట్ డివిజన్ క్రౌన్ ఫంక్షన్ హాల్ లో అంబర్ పెట్ మండల్ పాఠశాలల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మోటివేషన్ ప్రోగ్రాంకి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో అంబర్ పెట్ డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. మొత్తం 25 విద్యాసంస్థలకు చెందిన దాదాపు 1000 మంది 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు తన ప్రసంగాలతో విద్యార్థులను చైతన్యపరిచి వారిలో మానసిక స్తైర్యం కలిగే విధంగా చేశారని ఎమ్మెల్యే అన్నారు.

రానున్న పరీక్షలలో విజయం సాధించడమే లక్ష్యంగా, వారి మనోసంకల్పాన్ని పెంపొందించే విధంగా రూపొందాలని అన్నారు. కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత నెలకొంటుందని, వారి ఆలోచన విధానం మెరుగుపడుతుందని, వచ్చే పరీక్షలలో అద్భుత ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అంబర్పేట్ మండల్ విద్యాసంస్థల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రవి, ఇతర విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, చంద్రమోహన్, నిరంజన్, శ్రీనివాస్ రెడ్డి, షఫీ, బీపీ రెడ్డి, భీమేష్, గడ్డం సాయికిరణ్, రంగాచారి, ప్రసాద్, కావ్య శ్రీ, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజగోపాల్ నాయుడు, అనిల్ గౌడ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దళిత బంధు రాష్ట్రం మొత్తం వెంటనే అమలు చేయాలి

Satyam NEWS

స్వామిజీల‌ను కొనుగోళ్ళ ప‌ర్వంలోకి దింప‌డం సిగ్గు చేటు

Bhavani

కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment