30.7 C
Hyderabad
April 29, 2024 03: 30 AM
Slider ఆదిలాబాద్

మత్తుపదార్ధాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

#dgp

రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం  నిర్వహించిన,  వీడియో కాన్ఫరెన్స్ లో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ పాల్గొన్నారు. డీజీపీ ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజిపి మాట్లాడుతూ ప్రజలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ అధికారులకు తెలియజేశారు.

నిషేధిత మత్తు పదార్థాల  విషయంలో ప్రత్యేక దృష్టి కనబరచాలని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని , పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి  ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కేసుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి,ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నరో వివరిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.

మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి త్వరితగతిన చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో  జిల్లా అదనపు ఎస్పీ (ఏ.ఆర్) భీమ్ రావు, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, డి.పి ఓ సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఉపాధి పనుల్లో మరింత వేగం పెంచండి

Satyam NEWS

కాంగ్రెస్ సభకు పోలీసుల అనుమతి

Bhavani

త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

Satyam NEWS

Leave a Comment