40.2 C
Hyderabad
May 2, 2024 17: 02 PM
Slider వరంగల్

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరచుకోవాలి

#Taslima

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ములుగు,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

ములుగు జిల్లా జకారం గ్రామంలోని గిరిజన సంక్షేమ మిని గురుకులంలో జరిగిన మన ఊరిలో మన ఇగైట్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న తస్లీమా మాట్లాడుతూ విద్యార్థులు రాబోయే కాలంలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థి దశలోనే కార్యాచరణ రూపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ప్రతి విద్యార్ధి ఉన్నతంగా ఎదిగి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని తస్లీమా అన్నారు. అనంతరం వివిధ ప్రతిభా పాటవ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ దాసరి రమేష్, స్వేరోస్ సభ్యులు బొట్ల కార్తిక్, వివిధ విద్యా సంస్థల  ప్రిన్స్ పాల్స్ రమణ, టి.వి.రాజు, వైష్ణవి, అలివేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కొల్లు రవీంద్ర అరెస్ట్ కుట్రపూరితమైన చర్య

Satyam NEWS

వైజ్ఞానిక స్పృహ సమాజ అభివృద్ధికి మూలం

Bhavani

చర్చలు సఫలం: పెరిగిన రైస్ మిల్ దిన కూలి రేట్లు

Bhavani

Leave a Comment