40.2 C
Hyderabad
April 28, 2024 17: 33 PM
Slider ఖమ్మం

వైజ్ఞానిక స్పృహ సమాజ అభివృద్ధికి మూలం

#CPM

వైజ్ఞానిక స్పృహ వున్న సమాజమే వేగంగా అభివృద్ధి చెందుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లాకమిటి సభ్యులు బండారు రమేష్‌ అధ్యక్షతన జాతీయ వైజ్ఞానిక స్పృహ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆగస్ట్‌ 20న ప్రముఖ హేతువాది డా॥ నరేంద్ర దభోల్కర్‌ను ఛాందసవాద శక్తులు హత్య చేశాయని పేర్కొన్నారు.

మహారాష్ట్రకు చెందిన దభోల్కర్‌ అంధ విశ్వాసాలకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జీవితాంతం కృషి చేశారని తెలిపారు. మహారాష్ట్ర అంధ శ్రద్ధ నిర్మూలన సమితి (ఎం.ఎ.ఎన్‌.ఎస్‌.) సంస్థను స్థాపించి, దేశవ్యాప్తంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే ప్రయత్నం చేశారని కొనియాడారు. రెండు దశాబ్దాల పాటు దళితుల సమానత్వం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం డా॥ నరేంద్ర దభోల్కర్‌ పని చేశారని ఆయన ప్రశంసించారు.

అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చట్టం తేవాలని పోరాడారని తెలిపారు. దీన్ని వ్యతిరేకించిన ఛాందస శక్తులు డా॥ నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేశారని అన్నారు. అందుకోసమే ఆయన మరణించిన రోజైన ఆగస్ట్‌ 20ని జాతీయ వైజ్ఞానిక స్పృహ దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామికవాదులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక స్పృహను పెంచడం ద్వారా డా॥ నరేంద్ర దభోల్కర్‌కు నిజమైన నివాళిని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయాన్‌`3 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Related posts

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అంతా సిద్ధం

Satyam NEWS

గో గ్రీన్: ప్రతి గ్రామంలో నర్సరీ పనులు పూర్తి చేయాలి

Satyam NEWS

సిఎం సహాయ నిధి చెక్కులను పంచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment