28.7 C
Hyderabad
April 28, 2024 04: 51 AM
Slider ముఖ్యంశాలు

18 ఏళ్లుగా షబ్బీర్ అలీ ఇంట్లో విద్యుత్ ఉద్యోగి

నాయక్ అనే ఉద్యోగి పేరుతో 2 కోట్ల స్కామ్ :కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

రాష్ట్రంలో 83 వేల కోట్ల విద్యుత్ కుంభకోణం జరిగిందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో అటెండర్ రూపంలో భారీ కుంభకోణం జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 సంవత్సరాలుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో విద్యుత్ శాఖ ఉద్యోగి పని చేస్తున్నాడని, అతని వేతనం నెలకు లక్షన్నర ఉంటుందని ఈ లెక్కన ఒక అటెండర్ రూపంలోనే 2 కోట్ల స్కామ్ జరిగిందని వివరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.

జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జడ్పీ చైర్మన్ హోదాలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యే హోదాలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎంగా మొదటి నిర్ణయం హర్షణీయమని, 108 ను ఇదేవిధంగా తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అధికారుల సహకారంతో ప్రజారంజక పాలన సాగించాలని ఆకాంక్షించారు.

విద్యుత్ శాఖలో 83 వేల కోట్ల కుంభకోణంపై పత్రికల్లో చూసానని, ఈ స్కామ్ ఒక్క అధికారుల ద్వారా మాత్రమే అయిందని నేను అనుకోవడం లేదన్నారు. అధికారులు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని అనుకోవడం సరికాదని, ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే అధికారులు అవినీతికి పాల్పడతారన్నారు. సిఎండి ప్రభాకర్ సబార్డినెట్ గా ఉండాల్సిన నాయక్ అనే విద్యుత్ ఉద్యోగి గత 18 సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్న విద్యుత్ శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో అటెండర్ గా పని చేస్తున్నారన్నారు. నేటి వరకు ఆయన ఇంట్లోనే నాయక్ పని చేస్తున్నాడని, అతనికి నెలకు లక్షన్నర జీతం చొప్పున మాజీ మంత్రి ఇంట్లో ఎలా పనిచేస్తాడని తెలిపారు. ఏడుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఇంట్లో లక్షన్నర జీతంతో ఎలా పని చేస్తారని ప్రశ్నించారు.

ఒక్క అటెండర్ రూపంలోనే సుమారు 2 కోట్ల పైనే స్కామ్ జరిగిందన్నారు. నాయక్ తో పాటు మైనార్టీ శాఖలో పనిచేసే షాబాజ్ అనే వ్యక్తి కూడా 15 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ వద్ద పని చేస్తున్నారని, ఈ విషయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గుర్తించాలని కోరారు. అనధికార హోదాలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని, లేకపోతే ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.

ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిన సీఎం పనితీరు బాగుందని, అలాగే బయట కలుపుమొక్కల కంటే ఇంట్లో ఉన్న కలుపు మొక్కలపై సీఎం దృష్టి సారించాలని సూచించారు. ఏడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నేడు మంత్రి పదవికోసం సీఎం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ పాలనలో ఉచిత విద్యుత్ పథకం కింద 14 కంపెనీలకు పిపిఎలు జరిగాయని, సీఎం రేవంత్ రెడ్డి సమయమిస్తే స్వయంగా కలిసి వివరాలు అందిస్తానన్నారు. సీఎం హోదాలో రెవబెట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం హర్షణీయమని, తాను కూడా ఆదివారం కలవడానికి ప్రయత్నించిన కుదరలేదని, సోమవారం కలవడానికి ప్రయత్నిస్తానన్నారు. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, తాను ముగ్గురం పోటీలో ఉన్నామని, తాము సన్నిహితులమనే అనుకుంటున్నానన్నారు. అనధికార హోదాలో ప్రజాధనం వృధా చేస్తున్న విషయంపై విచారణ చేపట్టాలన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కరోనా కాలంలోనూ భారీగానే మల్లన్న హుండీ ఆదాయం

Satyam NEWS

సినిమాటోగ్రాఫర్ గా రాణిస్తున్న “విజయనగరం చిన్నోడు”

Satyam NEWS

ఉప్పల్  ప్రజలకు సేవకునిగా పనిచేస్తా: మందుముల పరమేశ్వర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment