వరంగల్ నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో నవంబర్ 28 నుంచి నుంచి నిర్వహించిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి యాగం నేడు ముగిసింది. ఐదు రోజులపాటు ఎంతో వైభవంగా నిర్వహించబడిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖ యాగం నేడు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం 5గంటలకు నిత్యాహ్నికం పూర్తైన తర్వాత ఆలయ అర్చకులు పంచామృతాలు, అమృతజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
ఆరు వేల మల్లెపూలతో స్వామివారికి మల్లికా పుష్పార్చన జరిపారు. అనంతరం చతుష్టానార్చనలో భాగంగా మూర్తి, కుంభం , మండలం, అగ్నియందు కల్పోక్తముగా జపహోమాభిషేకఅర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్నణ్య స్వామి కళ్యాణోత్సవం వందలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరైన సుమారు 1200మంది భక్తులు అన్నదానం కార్యక్రమం జరిగింది. ఆలయంలో మధ్యాహ్నం 12గంటలకు నవగ్రహ విగ్రహాల పునఃస్థాపన జరిగింది. అనంతరం ఈవో సునిత భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.