29.7 C
Hyderabad
May 14, 2024 02: 20 AM
Slider ముఖ్యంశాలు

Success story: భూగర్భ జలాలు పెంచే పథకాలు మరిన్ని చేపట్టండి

#jalashekthi

భూగర్భజలాల వాడకం తగ్గించి భూగర్భ జలాలు పెంచుకోడానికి చర్యలు మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని  ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్. అనురాధ చగ్తి సూచించారు.  నాగర్ కర్నూల్ జిల్లాలో జలశక్తి అభియాన్ అమలు, సాధించిన అభివృద్ధి మార్పుల పై పర్యవేక్షించడానికి వచ్చిన జాతీయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి  కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మొక్కను అందించి  స్వాగతం పలికారు. 

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, భూగర్భ జలాలు, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధ శాఖలు తదితర శాఖల ద్వారా జలశక్తి అభియాన్ అమలు తీరు తెన్నులను ప్రొజెక్టర్ ద్వారా పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న జిల్లాలలో నాగర్ కర్నూల్ జిల్లా సైతం ఉన్నప్పటికిని గత 6,7 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు, భూగర్భ జలాల పెంపు కై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా  చేపట్టిన వాటర్ షెడ్, పర్కులేషన్ ట్యాన్క్, ఇంకుడు గుంతలు, నీటి నిల్వ ట్యాన్క్ లు,  హరితహారం వంటి కార్యక్రమాల వల్ల నీటి ఎద్దడి ఉన్న జిల్లాగా కనిపించడం లేదన్నారు. 

అయితే జిల్లాలో భూగర్భ జలాలను అధికంగా వాడుకుంటున్న ఉరుకొండ, వెలదండ, ఉప్పునూతల వంటి మండలాల పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ మండలాల్లో భూగర్భ జలాల వాడకం 129 శాతం ఉండటాకి కారణాలు ఏంటని అడిగారు.  స్పందించిన జిల్లా కలెక్టర్  తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  ఈ మండలాల్లో భూగర్భ జలాల వాడకం తగ్గించి భూగర్భ జలాలు పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ప్రశ్నించారు. 

స్పందించిన గ్రౌండ్ వాటర్ అధికారిణి ఇప్పటికే ఉరుకొండ, వెలదండ వంటి మండలాల్లో తాగు నీటికి తప్ప ఇతర వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు బోరు బావులు వేయడం నిషేధించడం జరిగిందన్నారు.  ఆయా మండలాల్లో  వాటర్ షెడ్ ల నిర్మాణం, ఇంకుడు గుంతలు ఏర్పాటు, ఇళ్ళు, కార్యాలయ భవనాల పై పడే ప్రతి వర్షపు చుక్కను వృధా పోనియకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వాటిలో రిచార్జ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

భూగర్భ జలాలు పెంచేవిధంగా  ఉపాధిహామీ ద్వారా కొన్ని ప్రత్యేక పనులు చేపట్టడాం జరుగుతుందన్నారు. ప్రతి  గ్రామ సభలో  నీటి సంరక్షణను మొదటి ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంఘాలకు, అంగన్వాడీ కార్యకర్తల కు వివరించి నీటి వృధా అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాల పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేసారు.  సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలకు భూగర్భ జలాల పై అవగాహన కల్పించి అనవసరమైన నీటి వృధా ను ఆపి  రాబోయే రోజుల్లో భావితరాలకు మంచి నీటిని అందించే విధంగా కృషి ఉండాలన్నారు. 

ప్రతి గ్రామ పంచాయతీలో నీటి పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.  గ్రామాల్లో పాని పంచాయితీలు ఏర్పాటు చేయాలని సూచించారు.   ఈ రెండు రోజుల్లో జిల్లాలో ఉండి కొన్ని గ్రామ పంచాయతీలలో పర్యటించి జలశక్తి అభియాన్ అమలును పరిశీలిస్తామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల క్రితం జిల్లాలో తాగు నీరు, సాగు నీరు లేక రైతులు తమ పంట పొలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి కూలి పనులకు వెళ్ళేవారని అదేవిధంగా తాగు నీరు సరిగ్గా లేక కొంత ప్రాంతంలో ఫ్లోరైడ్ తో బాధపడ్డారని తెలిపారు.  మహాత్మాగాంధీ ఎత్తిపోతల పూర్తి  అయ్యాక జిల్లాలో 4.34 లక్షల ఎకరాలకు   సాగు నీరు వచ్చిందన్నారు. 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి అయితే జిల్లాకు మరో 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.  గొలుసుకట్టు ద్వారా చెరువులు నింపుకోవడంతో  భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయ సాగుకు ఉపయోగ పడుతుందన్నారు.  మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని చెరువులకు పూడికతీత, మరమ్మతులు చేసుకోవడం జరిగిందన్నారు. 

ఉరుకొండ, వెలదండ మండలాలు ఆయకట్టుకు చివరి భాగంలో ఉన్నందున అక్కడి రైతులు భూగర్భ జలాలు, వర్షాధార  పంటల పై ఆధార పడి వ్యవసాయం చేస్తున్నారని వివరించారు.  జిల్లాలో భూగర్భ జలాలు పెంచడానికి జలశక్తి అభియాన్ కింద పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటి సత్ఫలితాలు కనబడుతున్నాయని తెలిపారు.   హరితహారం ద్వారా ప్రతి సంవత్సరం  లక్షల  మొక్కలు  పెంచడం జరుగుతుందన్నారు.  ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు విరివిగా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేసారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి,  ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రోహిత్, హైదరాబాద్ నుండి కార్యనిర్వాహక ఇంజనీరు సి.డబ్ల్యూ.సి డి.ఎస్. ప్రసాద్,  పి.డి డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, జిల్లా భూగర్భ జలాల అధికారి రమాదేవి,   డి.పి.ఓ కృష్ణ, డి.ఈ.ఓ గోవిందరాజులు, డి.ఈ. ఇరిగేషన్, ఇతర జిల్లా అధికారులతో పాటు మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

సోమన్న యువసేన ఆధ్వర్యంలో నేడు  ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి

Satyam NEWS

కుర్చికి వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి, యువజన సమితి నేతలు

Satyam NEWS

Leave a Comment