33.7 C
Hyderabad
April 29, 2024 01: 22 AM
Slider ప్రత్యేకం

ఇక నుంచి డైలీ హంట్ లో సత్యం న్యూస్

daily hunt sayam

అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందిన సత్యం న్యూస్ తన ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేసింది. విశిష్ట కథనాలు, వార్తలు, విశ్లేషణలతో వీక్షకులను ఆకట్టుకుంటున్న సత్యం న్యూస్ మరింత మందికి చేరువ అయ్యే అవకాశం ఇప్పుడు కలిగింది. సత్యం న్యూస్ ప్రారంభించిన నాటి నుంచి వీక్షకులు ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు.

సత్యం న్యూస్ ఏ రాజకీయ పార్టీకి, ఏ వ్యక్తికి అనుకూలంగా పని చేయదు. సోషల్  మీడియా అంటే జర్నలిజం విలువలు ఉండవు అనుకునే ఆలోచనలకు భిన్నంగా రూపుదిద్దుకున్నది సత్యం న్యూస్. విశేష అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టుల సారధ్యంలో సత్యం న్యూస్ నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి గెలవబోతున్నదని, 150 స్థానాలు రాబోతున్నాయని ముందుగా చెప్పిన ఏకైక వార్తా సంస్థ సత్యం న్యూస్.

తెలంగాణ లో నాలుగైదు పార్లమెంటు స్థానాలలో టిఆర్ఎస్ ఎదురీదుతున్నదని ముందుగానే సత్యం న్యూస్ చెప్పింది. ఏపి తెలంగాణ పాలనావిషయాలలో జరుగుతున్న అంతర్గత అంశాలను వెలుగులోకి సత్యం న్యూస్ తెచ్చింది. యాదగిరి గుట్ట పై కేసీఆర్ బొమ్మలే కాదు బూతుబొమ్మలు కూడా చెక్కారని చెప్పిన ఒకే ఒక మాధ్యమం సత్యం న్యూస్. సత్యం న్యూస్ ఇచ్చే విశ్లేషణలపై ఎందరో ఘాటు కామెంట్లు చేశారు కానీ ఆ తర్వాత అవి నిజమని వారే అంగీకరించారు.

 ఆవిర్భవించిన అతి తక్కువ సమయంలోనే సత్యం న్యూస్ ఎన్నో విషయాలను సమాజం ముందుకు తీసుకువచ్చింది. సత్యం న్యూస్ మరింత ముందుకు వెళ్లేందుకు డైలీ హంట్ యాజమాన్యం సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

సత్యం న్యూస్ ఇంత వేగంగా, ప్రత్యేకతతో పని చేయడానికి ఎందరో జర్నలిస్టు మిత్రులు సహకరిస్తున్నారు. నిజమైన నిఖార్సయిన జర్నలిస్టులు సత్యం న్యూస్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అత్యంత వేగంగా సమాచారాన్ని పాఠకులకు చేరవేసే డైలీ హంట్ లో సత్యం న్యూస్ భాగం కావడం గర్వకారణం.

సత్యం న్యూస్ పాఠకులు డైలీ హంట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సత్యం న్యూస్ ను వీక్షించవచ్చు. డైలీ హంట్ లో ఫాలో బటన్ నొక్కడం ద్వారా సత్యం న్యూస్ ప్రతి కదలికా మీకు చేరుతుంది. జర్నలిజం విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న సత్యం న్యూస్ ను మరింతగా ఆదరిస్తారని ఆశిస్తూ… సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.

Related posts

కర్నాటకలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

భయంతో ఎమ్మెల్యేలు

Murali Krishna

యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం

Satyam NEWS

Leave a Comment