40.2 C
Hyderabad
April 29, 2024 18: 30 PM
Slider విశాఖపట్నం

వైజాగ్ స్టీల్ ఉద్యమంలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

#Vijayasaireddy

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  నిరాహారదీక్ష ప్రారంభించారు.

జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద  సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే వాసుపల్లి దీక్ష చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ విజయ సాయి రెడ్డి, మంత్రి అవంతి, వైసీపీ నాయకులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరయ్యారు.

ముందుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఎం వి వి సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీ కి లేఖ రాశారని తెలిపారు.

సొంత గనులు లేకపోవడం వలన స్టీల్ ప్లాంట్ నష్టాలలో నడుస్తుందని ఆయన అన్నారు. పరిశ్రమ ను ప్రెవేటు పరం చేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఎంతటి త్యాగాలకు అయిన సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపించడానికి కేంద్రం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని ఆయన అన్నారు.

స్టీల్ ప్లాంట్ అనేది జాతీయ సంపద అని, దాన్నిప్రైవేటుపరం చేసే హక్కు ప్రధాన మోడీ కి లేదని మంత్రి అవంతి అన్నారు. కేంద్ర మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకుంటామని ఆయన అన్నారు.

Related posts

పార్టీ అనుబంధ కమిటీ లు త్వరగా పూర్తి చేయాలి

Satyam NEWS

క‌ట్నం కోసం అత్త‌, మామ‌ల‌ను చంపిన అల్లుడు!

Sub Editor

15 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన 17 ఏళ్ల బాలుడు

Satyam NEWS

Leave a Comment