నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్ తుమ్మెద గ్రామంతో పాటు ఆయా గ్రామంలో కొనసాగుతున్న యాసంగి వరి పంట సాగును ఏవో విజయశేఖర్, ఏ ఈ ఓ లు సందర్శించారు. అలాగే సాగుచేసిన పంట వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. వరి పంటలో అడుగున 20: 20:0:13 బదులు డీఏపీ ని వాడాలని రైతులకు వివరించారు.
ఇలా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చునని రైతులకు ఏవో విజయశేఖర్ వివరించారు. అనంతరం మెల్ల కుంట తండా,చీనూర్ గ్రామాలలో క్రాప్ బుకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.