37.2 C
Hyderabad
May 6, 2024 13: 25 PM
Slider ఖమ్మం

మోడీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్‌కు మద్దతు

#tammineni

మోడీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్‌కు మద్దతు వుంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంచికంటి మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మత విభజన జరగకుండా చూడటంతో పాటు బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యంగా ఉంచడమే ధ్యేయంగా సీపీఎం పనిచేస్తుందన్నారు. బీజేపీకి దీటుగా ప్రస్తుతం కేసీఆర్‌ పోరాడుతున్నా ప్రాంతీయ పార్టీలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయనే విషయాన్ని విస్మరించడానికి వీల్లేదన్నారు. కేసీఆర్‌ అధికారానికే ఎసరు వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టే బీజేపీకి దూరమయ్యాడన్నారు. రాజ్యాంగ విలువలను నాశనం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యతిరేక శక్తులను చేరదీస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే కేసీఆర్‌కు దగ్గరయ్యామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్‌కు మద్దతు ఉంటుందన్నారు.

భవిష్యత్తులో పొత్తులు కుదిరే అవకాశం ఉండవచ్చు కానీ ఇప్పటి వరకూ దీనిపై ఏపార్టీతోనూ చర్చలు జరగలేదన్నారు. రాష్ట్రంలో 9 నియోజకవర్గాలపై కేంద్రీకరణ యథావిధిగా కొనసాగుతుందన్నారు. దీనిలో ఖమ్మం జిల్లాలోనే నాలుగు స్థానాలు ఉన్నాయని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీని ఓడిరచడంతో కమ్యూనిస్టుల పట్ల గౌరవం పెరిగిందన్నారు. కేంద్రం విచ్చలవిడిగా ధరలు పెంచుతున్న నేపథ్యంలో గ్రామీణ నిరుపేదలపై విపరీతంగా భారం పడుతోందన్నారు. జిల్లాలో జరిగే వ్యవసాయ కార్మికసంఘం మహాసభలకు భారీగా జన సమీకరణ చేసి కేంద్రం విధానాలు, ధరల పెరుగుదలను తిప్పికొట్టాలన్నారు. ఖమ్మంలో జరిగే వ్యవసాయ  కార్మిక సంఘం మహాసభలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలని ఆకాంక్షించారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మహాసభల విజయవంతానికి దిశానిర్దేశం చేశారు.

Related posts

ముగిసిన వారం రోజుల ఏఐసిటిఈ – ఐడియా అధ్యాపకుల శిక్షణ

Satyam NEWS

31న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

మొన్న కొమ్మినేని నేడు నన్నపనేని

Satyam NEWS

Leave a Comment