29.2 C
Hyderabad
May 9, 2024 23: 36 PM
Slider మహబూబ్ నగర్

ఇంటింటా జ్వర సర్వే: లక్షణాలు ఉన్నవారికి ఐసోలాషన్ కిట్ల అందచేత

#nagarkurnool

ఇంటింటా జ్వర సర్వే నిర్వహణని నాగర్ కర్నూల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య బృందాలు నాగర్ కర్నూల్ పట్టం లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా జ్వర సర్వే నిర్వహణ పక్కాగా నిర్వహించాలని వైద్య సిబ్బంది కి సూచించారు. ప్రజలు వైద్య బృందాలకు సహకరించాలని, ఈ సర్వే లో జ్వరం, జలుబు, దగ్గు, బాడీపెయిన్స్, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారి ఇంటి వద్దనే అవసరమైన వారికి హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుచేస్తున్నామని, లక్షణాలు ఉన్న వారు ఐసోలాషన్ కిట్స్ వాడితే సరిపోతుందని, ఏవిధమైన అనారోగ్యం అనిపించిన వైద్య సిబ్బంది ని సంప్రదించాలని సూచించారు.

ఎలాటి విపత్కర పరిస్థితులు ఎదురైన వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి లో సిద్ధంగా ఉందని, ఎలాంటి పరిస్థితులను అయిన ఎదుర్కొనేల సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరు అధైర్య పడొద్దని, ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని,  వైద్య సిబ్బంది కి సహకరించి వైద్య సిబ్బంది సూచించిన సలహాలు సూచనలు పాటించాలన్నారు.

కోవిడ్ వాక్సిన్ ప్రతి ఒక్కరు రెండు డోసులు వేసుకోవాలని, టీనేజ్ వాళ్ళు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి ప్రత్యేక శిభిరాల ద్వారా కోవాక్సిన్ వాక్సిన్ వేస్తున్నామని ప్రతి ఒక్కరు  వాక్సిన్ వేసుకోవాలని వాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే రక్షణ పొందవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరచు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డా.దశరథం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

Satyam NEWS

మునిసిపల్ ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ తాజా వల

Satyam NEWS

గుజరాత్ లో విద్వేషం రెచ్చగొట్టేవారిని ఓడించండి

Satyam NEWS

Leave a Comment