38.2 C
Hyderabad
April 27, 2024 15: 03 PM
Slider ప్రత్యేకం

స్తంభించిన పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ..గంట సేపు నిలచిపోయిన ఈ చలానాలు…!

#echalan

ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ..ఆ శాఖకు కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఏండ్రాయిడ్ ,స్మార్ట్ ఫోన్ల స్పీడ్ యుగంలో పోలీసు వ్యవస్థ కమ్యూనికేషన్ మరింత కీలకం. ఇక ప్రైవేట్ సంస్థ ఎయిర్ టెల్ తో పోలీసు శాఖ ఒప్పందం చేసుకుని… ఏటా కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఉంటుంది.

అయితే పోలీసు శాఖ లో ఈ చలానాల ద్వారా వచ్చిన సొమ్ము సగం శాఖ కు సగం సదరు ప్రైవేట్ సంస్థ కు చెల్లిస్తూ వస్తోంది కూడా. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు కు ఈ చలానాల ద్వారా వచ్చిన సొమ్ము ప్రభుత్వ శాఖ లో అటు రెవిన్యూ కు ఇటు పోలీసు శాఖ కు వెళుతూ ఉంటుంది.

దీంతో పోలీసులు మరీ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు రోజు వారీ విధిస్తున్న ఈ-చలానాలు రూపేణా వచ్చిన ఆదాయం శాఖ కు వెళ్లుతోంది.అయితే 20 వ తేదీ సాయంత్రం ఒక గంటసేపు పోలీసు శాఖ తాలూకు ఈ-చలానా స్తంభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ-చలానా వ్యవస్థ పని చేయలేదు.

రాష్ట్రంలో ని విజయనగరంలో ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు… నగరంలో ని రైల్వేస్టేషన్ వద్ద ఈ-చలానాలు వేస్తుండగా వ్యవస్థ మొరాయించడంతో..ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడం తో ఈ-చలానా మొత్తం స్తంభించినట్టు తెలిసింది. దీంతో సత్యం న్యూస్.నెట్ ప్రతినిధి అసలు కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.

జిల్లా పోలీసు కమ్యూనికేషన్ వింగ్ ద్వారా ఏకంగా అమరావతి నుంచీ ఈ-చలానా వ్యవస్థ స్తంభించిండంతో గంట సేపు వ్యవస్థ మొత్తం నిలచిపోయింది.దీంతోపాటు ఆ సమయం ద్వారా పోలీసు శాఖ కు వచ్చే ఆదాయం నిలచిపోయింది.ఇక ట్రాఫిక్ పోలీసులు ఆ సమయం అంత సేపు కాస్సేపు హమ్మయ్య అనుకోగా…ప్రజలకు రిలాక్స్ అయ్యిందనే చెప్పాలి.

Related posts

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

Satyam NEWS

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి

Murali Krishna

వనపర్తి జిల్లా పోలీసు ప్రజావాణిలో 6 ఫిర్యాదులు

Bhavani

Leave a Comment