23.7 C
Hyderabad
May 8, 2024 05: 33 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం వద్ద పలువురు పట్టణ ప్రముఖులు పుష్ప మాలలతో అలంకరించి ఘనమైన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన నరేంద్ర నాథ్ దత్తా (స్వామి వివేకానంద) ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి అని, ఆధ్యాత్మిక నాయకుడు అని అన్నారు.

1863 జనవరి 12న జన్మించిన వివేకానంద రాజయోగ,కర్మయోగ,భక్తి యోగ,జ్ఞాన యోగ సాహిత్య రచనలు చేశారని, భారతదేశాన్ని జాగృతము చేయడంతో పాటుగా ఇంగ్లాండ్ అమెరికా వంటి దేశాలలో యోగ, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానంద కు దక్కిందని అన్నారు.

అమెరికాలో హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తన ఉపన్యాసం ద్వారా వివరించారని, స్వామి వివేకానంద ఉపన్యాసాలకు అమెరికా దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.షికాగోలో ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న గొప్ప మహనీయుడు స్వామి వివేకానందుడు అని అన్నారు.

1984వ, సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. స్వామి వివేకానంద చూపిన సన్మార్గంలో యువతరం నడవాలని,వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని,అదే స్వామి వివేకానందకు మనమిచ్చే ఘనమైన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు,స్వామి వివేకానంద అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కృష్ణయాదవ్ జన్మదినం నాడు నిత్యావసరాలు పంపిణీ

Satyam NEWS

వాల్మీకులను మోసం చేసిన కెసిఆర్: డి.నారాయణ

Satyam NEWS

విరాళాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment