23.7 C
Hyderabad
May 8, 2024 06: 02 AM
Slider ఖమ్మం

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు

sweet talk to field assistants serp employees

పేదరిక నిర్మూలనలో భాగంగా డ్వాక్రా మహిళల సంఘాలకు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని సీఎం కేసిఆర్ చేసిన ప్రకటన పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో ఎన్నడూ లేనివిధంగా సెర్ఫ్‌ సొసైటీ ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు సీఎం కేసిఆర్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి అజయ్ పేర్కొన్నారు. అలాగే ఇందులో భాగంగా పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం కేసిఆర్ ప్రకటించడం సగటు సామాన్యుడి నాడి తెలిసిన సీఎం అని, ఆయనకు దార్శనికతకు ఇది ఓ ఉదాహరణ అని చెప్పారు . మరోవైపు గత కొంత కాలంగా ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని సీఎం నిర్ణయాన్ని మంత్రి స్వాగతించారు. ఇప్పటి నుంచి సీఎం కేసిఆర్ చేసిన సూచనల పాటించి నిరసనలు చేయకుండా ఉండాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

Related posts

బుజ్జగింపులకు రంగంలోకి దిగిన కేసిఆర్

Satyam NEWS

గిరిజనులకు ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకున్న కేసీఆర్

Bhavani

కొల్లాపూర్ సమీపంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

Satyam NEWS

Leave a Comment