32.7 C
Hyderabad
April 26, 2024 23: 35 PM
Slider హైదరాబాద్

నిత్యావసరాలు అందించిన కాచిగూడా కార్పొరేటర్

talasani 151

కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు లాక్ డౌన్ అమలవుతున్న విపత్కర పరిస్థితుల లో పేదలు ఆకలితో అలమటించ వద్దనే ముఖ్యమంత్రి పిలుపుతో అనేక మంది దాతలు, స్వచ్చంద సంస్థలు స్పందిస్తూ చేయూత నిచ్చేందుకు ముందుకొస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

బుధవారం కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల ఖన్నా చైతన్య ఆధ్వర్యంలో పేద ప్రజలకు అంబర్ పేట్ కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం లతో కలిసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ వలన ఉపాధి లేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో పేద ప్రజలకు అవసరమైన బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం పట్ల కార్పొరేటర్ చైతన్య ను మంత్రి అభినందించారు.

లాక్ డౌన్ పూర్తయ్యే వరకు స్వచ్చంద సంస్థలు, దాతలు ఇలాంటి కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Related posts

కరోనా ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Satyam NEWS

దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment