31.7 C
Hyderabad
May 7, 2024 01: 26 AM
Slider ప్రత్యేకం

కోవిడ్ వైరస్ పెట్టుకుని మన మధ్యే తిరుగుతున్న తబ్లిగీ

tabligi jamath

ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు లో జరిగిన తబ్లిగీ జమాత్ కు విదేశాల నుంచి ఎంత మంది వచ్చారో తెలుసా? ఒక్క సారి గుండె బిగపట్టుకోండి. ఈ వార్త వింటే గుండె గుభిల్లు మనక మానదు. సుమారుగా రెండు వేల మంది తబ్లిగీ జమాత్ కు హాజరయ్యారు.

వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? మన మధ్యనే. వీరందరిలో కోవిడ్ 19 ఉంది. వీరంతా కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తున్న కారియర్లు. తక్షణమే అందరూ ఊపిరి బిగబట్టుకోండి. వీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. దేశంలోని పలు రాష్ట్రాలకు ఇప్పటికే చేరుకుని ఉన్నారు. ఎవరూ బయటకు రావడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వాలు బతిమాలుతున్నాయి తప్ప వీరు బయటకు రావాలని హెచ్చరించడం లేదు. ఈ విషయాలన్నీ ఎవరో వేరేవారు చెప్పినవో లేక కావాలని ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి రాస్తున్నవో కాదు. ఇవన్నీ కేంద్ర హోం శాఖ వద్ద ఉన్న వివరాలు.

జమాత్ కు హాజరైన విదేశీయులలో చైనా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం, ఇండోనేసియా, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్ నుంచి సుమారుగా 2000 మంది వచ్చి మన దేశంలో తిరుగుతున్నారు.

తబ్లిగీ జమాత్ లో పాల్గొని వీరందరూ కరోనా వైరస్ ను కలిగి ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ లో తెలంగాణ లోని హైదరాబాద్ లో ఇండోనేసియా కు చెందిన మత ప్రవక్తలు తిరుగుతున్న విషయం తెలిసిందే. వీరి నుంచి ఆయా ప్రాంతాలన్నీ వైరస్ మయం అయ్యాయి.

ఇప్పటికే వీరి కారణంగా తెలంగాణలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఆంధ్రా నుంచి లెక్క తేలడం లేదు కానీ కోవిడ్ 19 కేసులు మాత్రం పెరిగిపోయాయి. తమిళనాడు ప్రభుత్వం తమకు కేంద్రం నుంచి వచ్చిన జాబితాలో 49 మందిని ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది.

మార్చి 28 వ తేదీ నాడే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది కానీ ఫలితం లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 27నుంచి మార్చి 1వ తేదీ వరకూ కౌలాలంపూర్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కు ఇండియా నుంచి చాలా మంది హాజరయ్యారు.

 అన్ని దేశాల వారూ మలేసియాలోని కౌలాలంపూర్ మసీదులో కలుసుకున్నారు. అక్కడ నుంచి అందరూ నిజాముద్దీన్ వచ్చారు. మలేసియా నుంచి వచ్చిన వారిని ముందుగా గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే గుర్తించిన వారిలో కోవిడ్ 19 పాజిటీవ్ ఉంది.

భారత్ నుంచి మలేసియాకు వెళ్లిన 142 మందిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తబ్లిగీ జమాత్ కు విదేశాల నుంచి  పర్యాటక వీసా పైన వచ్చి మత ప్రచారానికి పాల్పడుతున్న వీరందరిపైనా కూడా కేంద్ర ప్రభుత్వం వీసా నిబంధనల ఉల్లంఘన కేసులు పెడుతున్నది.  

Related posts

ఒంటిమిట్టలో గరుడ వాహనంపై శ్రీ కోదండ రామ స్వామి

Satyam NEWS

కర్నూలులో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Bhavani

కొన్ని కారణాల వల్ల రాములన్నకు టికెట్ ఇవ్వలేదు

Bhavani

Leave a Comment