40.2 C
Hyderabad
April 26, 2024 11: 31 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా పాజిటివ్ కేసులు

amaravathi

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో  ఇద్దరు  కోలుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కరోనా వైరస్ పై సమీక్షిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కు అనేక ఉన్నత స్థాయి కమిటీ లు వేశారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి.

సీఎం సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్ల ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చాయని నివేదికలు వస్తున్నాయి. వాళ్ళు స్థానిక అధికారులకు సహకరించి స్వచ్చందంగా పరీక్షలు  చేయించుకోవాలి అని మంత్రి వ్యాఖ్యానించారు.

Related posts

‘‘మాట తప్పి…మడం తిప్పి మా మనసుల్ని గాయపరచద్దు జగన్’’

Satyam NEWS

మున్సిపల్ వ్యర్ధాల నిర్వహణకు తమిళనాడు అధికారుల ప్రశంస

Satyam NEWS

ఆదుకోని ప్రభుత్వం కారణంగా ప్రమాదంలో ప్రజారోగ్యం

Satyam NEWS

Leave a Comment