40.2 C
Hyderabad
April 26, 2024 12: 28 PM
Slider ముఖ్యంశాలు

నిజాముద్దీన్ మర్కజ్‌ మసీదు ఎపిసోడ్ లో కీలక ఆదేశాలు

markaj masjid

తబ్లిగీ జమాత్ కు వచ్చిన విదేశీయులను తక్షణమే వారి వారి స్వదేశాలకు పంపాలని లేకపోతే నిర్భంధంలో ఉంచి చికిత్స అందించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాత ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో భారీ ఎత్తు తబ్లీగ్ జమాత్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ఇండోనేసియా, థాయ్ లాండ్, మలేసియా, కిర్గిజస్థాన్ ల నుంచి భారీ ఎత్తున ఇస్లాం మత ప్రవక్తలు హాజరైన విషయం తెలిసిందే. వీరంతా మర్కజ్ మసీదు నుంచి విడదల వారీగా నిర్దేశించుకున్న దక్షిణాది రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడ ఎంతో మందిని కలిసి మత ప్రచారం చేశారు.

కరోనా వ్యాధికి సంబంధించిన లాక్ డౌన్ ఉన్నా కూడా వీరి కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో కరోనా వ్యాధి విస్తరించింది. ఈ  విదేశీయులందరినీ తక్షణం వారి స్వస్థలాలకు పంపాలని కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులను ఆదేశించింది. 

కోవిడ్ 19 ప్రభావం ఉన్న వారికి అవసరమైన చికిత్స అందించాలని, నిర్బంధ కేంద్రాలకు పంపాలని పేర్కొంది. కోవిడ్ 19 ప్రభావం లేని వారిని వెంటనే తిప్పి పంపే ఏర్పాటు చేయాలని, ఒకవేళ విమానాలు దొరికే పరిస్థితి లేని పక్షంలో నిర్బంధ కేంద్రాల్లో ఉంచాలని తెలిపింది. వీరికి అయ్యే ఖర్చును వారిని తీసుకువచ్చిన సంస్థ ద్వారా రాబట్టాలని సూచించింది.

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

Satyam NEWS

మావోయిస్టు నంటూ ఓ ఆర్మీ ఉద్యోగి…5 కోట్ల డిమాండ్…!

Satyam NEWS

Good gesture: మానవత్వానికి పెద్దపీట వేసిన జర్నలిస్టులు

Satyam NEWS

Leave a Comment