38.2 C
Hyderabad
May 2, 2024 19: 11 PM
Slider వరంగల్

ములుగు లో గర్జించిన గౌడన్న

#mulugu

ఏజెన్సీ లో రద్దు చేసిన గీత సోసైటీ లను తక్షణమే పునరుద్ధరించాలని కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి చిన్న నర్సయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారి కి అధికారికి వినతిపత్రం అందచేశారు. మునుగోడు ఎన్ని కల ముందు గీత కార్మికుల సమస్య ల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మికుల కు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, ప్రమాదాలు జరుగకుండా సేఫ్టీ మోకులు ఇవ్వాలని కోరారు. బీసీ కులాల లు ఇచ్చిన విధంగా బీసీ బంధు కోసం గీత కార్మికుల నుంచి కూడా దరఖాస్తు లు తీసుకొవాలని కోరారు.

ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్ష వహించారు. ఇచ్చిన హామీలు ఆ మలు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని చలోప్రగతి భవన్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మటి సదయ్య గౌడ్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, తాళ్లపల్లి నరేందర్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, పాలకుర్తి రవీందర్ గౌడ్, గుండెబోయిన శ్రీహరి గౌడ్, జక్కు రాజు గౌడ్, బుర్ర వేణు గౌడ్, మొక్క రాజు గౌడ్, మడ్డి నర్సయ్య గౌడ్, మాచర్ల ఎలంద్ర గౌడ్, బోనగాని సారయ్య, వచ్చావాయి సారయ్య గౌడ్, ఎరుకలి గోవిందరాజు లు గౌడ్, పులి రమేష్ గౌడ్, కోటగిరి సురేందర్ గౌడ్ శోభన్ గౌడ్, పున్నం గౌడ్, కారుపోతుల సత్యం గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్, ముసినిపల్లి శ్రీనివాస్ గౌడ్, కుమార్ గౌడ్, కునుర్ అశోక్ గౌడ్,,అనగొని శంకరయ్య గౌడ్, కక్కెర్ల సమ్మయ్య గౌడ్ తదితర 500 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి వేడుక

Satyam NEWS

ఏప్రిల్ 3 నుంచి సలేశ్వరం జాతర

Satyam NEWS

అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి ఇది

Satyam NEWS

Leave a Comment