28.7 C
Hyderabad
May 6, 2024 01: 23 AM
Slider కర్నూలు

ఇంటర్ విద్యార్ధిని దుర్గ మరణానికి బాధ్యుడు ప్రిన్సిపాలే

#nandyalacollege

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ స్థానిక సిరివెళ్ళ మండలం లోని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

బి ఓబులేసు, షేక్ రియాజ్, వెంకట్, జయరాజు, మాబు, హుస్సేన్ లు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దుర్గ అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి కి కాలేజ్ ప్రిన్సిపల్ ఖాజా హుస్సేన్ కారణం అని ఆరోపించారు.

విద్యార్థి ఆరోగ్య పరిస్థితి తల్లిదండ్రులు కు చెప్పకుండా నిర్లక్ష్యం చేసి విద్యార్థి నిండు ప్రాణాలు పోవడానికి కారకూడయ్యాడని వారన్నారు. గతంలో కూడ మోడల్ స్కూల్ లో విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవారని అప్పట్లో సంబంధిత అధికారులకు విన్నవించినా ప్రయోజనము లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రిన్సిపాల్ రోజుకొక బైక్ మీద వస్తూ స్కూల్ క్యాంపస్ లో సిగరెట్ తాగుతూ నియంతలా వ్యవరిస్తూ వుండేవాడని వారు అన్నారు.

లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటూ మోడల్ స్కూల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాడని ఎంతో మంది విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ అధ్యాపకుడిని వెనుక వేసుకొస్తూ అతడిని కాపాడే ప్రయత్నం నిత్యం జరుగుతుందని వారన్నారు.

ఈ రోజు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఓ విద్యార్ధిని మృతి అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులు కూడ నోరుమేదపలేని స్థితి లోకి రావడం కొన్ని అనుమానాలకు దారితీస్తుంది అని  వారు ఆరోపించారు

అమ్మాయి మృతిపైన పూర్తి విచారణ జరిపించాలని వారు కోరారు అంతేకాకుండా మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసి విద్యార్థి తల్లిదండ్రులు కు న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. అధికారులు ఒత్తిడికి రాజకీయ ఒత్తిడులకు అమ్మాయి తల్లిదండ్రులు గురయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

సేవకు అంకితమైన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

Satyam NEWS

ఆటో బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

Satyam NEWS

క్రిమినల్ బ్యాచ్: పెళ్లాం సహకారంతో యువతికి ట్రాప్

Satyam NEWS

Leave a Comment