32.2 C
Hyderabad
May 13, 2024 22: 59 PM
Slider ఖమ్మం

ఆరోగ్యాo పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

#police department

పోలీసు శాఖలో పని చేసే అధికారులు,సిబ్బంది కొరకు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీసులందరికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డా.వినీత్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులలో నిమగ్నమై ఉంటున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వారికోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లా పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని

కోరారు.గుండె,ఊపిరితిత్తులు,ఎముకలు,న్యూరాలజీ,కంటి చికిత్సలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత చికిత్సల కొరకు నిపుణులైన వైద్యులను పిలిపించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.ఇచ్చట వైద్య పరీక్షలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారిని పోలీసు శాఖ తరపున మెరుగైన చికిత్స చేయించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందానికి,పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న పోలీస్ అతిధి గృహం నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరలోనే అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ డిఎస్పీ విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి, సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

అల్పపీడనంతో చెన్నైని ముంచెత్తుతున్న వర్షాలు

Satyam NEWS

కర్నూలు ఎస్పీగా కృష్ణకాంత్ పదవీ స్వీకారం

Satyam NEWS

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment