36.2 C
Hyderabad
April 27, 2024 19: 48 PM
Slider కర్నూలు

కర్నూలు ఎస్పీగా కృష్ణకాంత్ పదవీ స్వీకారం

#kurnoolsp

కర్నూలు జిల్లా నూతన ఎస్పీ గా జి. కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కృష్ణకాంత్ కు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, ఎఆర్ సిబ్బంది స్వాగతం పలికి గౌరవందనం చేశారు. జిల్లా ఎస్పీ గా జి. కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సివిల్స్  రాసి 2017 బ్యాచ్ ఐపియస్  కు ఎంపికయి ఆంధ్ర క్యాడర్ కు రావడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలో 24 గంటలు  ప్రజలకు అందుబాటులో ఉండి  ప్రజల సమస్యల పై తమ వంతుగా సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భధ్రత, రోడ్డు  భద్రత, సైబర్ నేరాలు, ఇల్లిగల్ యాక్టివిటిస్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

రాయలసీమ వాసి గా కర్నూలు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. మీడియా సహకారం  అందించాలన్నారు. కృష్ణ కాంత్ స్వస్థలం అనంతరం పురం జిల్లా,  గుత్తి మండలం, SS పల్లె  గ్రామం. పదో తరగతి వరకు అనంతపురం జిల్లా గుత్తి జడ్పీ పాఠశాలలో , గుంతకల్లులోని శంకరానంద స్వామి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ,  అనంతపురం పట్టణంలోని సీఎంఐ కళాశాలలో బీఎస్సీ బయో టెక్నాలజీ , హర్యానా లోని నేషనల్ డైరీ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు.

ఐపియస్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 9 నెలల పాటు చింతూరు ఏఎస్పీగా, అల్లూరి సీతా రామరాజు జిల్లా రంపచోడవరం లో 1 సంవత్సరం పాటు ఒయస్డీ గా పని చేశారు. గోదావరి  మావోయిస్టు ప్రాంతాలలో 2 సంవత్సరాలు పని చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్,  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిస్పీలు వెంకటాద్రి,  వెంకట్రామయ్య, నాగభూషణం, యుగంధర్ బాబు,  వినోద్ కుమార్,  కెవి మహేష్, ఇలియాజ్ భాషా, డిపిఓ  ఎఓ సురేష్ బాబు,  సిఐలు ఉన్నారు.

Related posts

షరతులు లేని చర్చలకు రైతులను ఆహ్వానించాలి

Satyam NEWS

రుణ మాఫీ నిధులు విడుదలపై రైతుల సంబురాలు

Satyam NEWS

ఎనాలసిస్: సడలింపులు క్రమశిక్షణ ఉల్లంఘనకు కాదు

Satyam NEWS

Leave a Comment