28.7 C
Hyderabad
May 5, 2024 10: 41 AM
Slider నల్గొండ

ప్రయివేటు ఆసుపత్రులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి

#CITUHujurnagar

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ, తమిళనాడు ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకుని ప్రైవేట్ వైద్యశాలలను ప్రభుత్వం ఆధీనం చేసుకొని ఆక్సిజన్ లేక జరిగే కరోనా మరణాలను ఆపాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ప్రభుత్వాన్ని కోరారు‌.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు అనుబంధం ఆధ్వర్యంలో కరోనా సోకిన పేషెంట్లకు నిత్యావసర సరుకులు, కూరగాయలు,ఆర్థిక సహాయం అందించిన సందర్భంగా రోషపతి మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో పది వేల రూపాయల చొప్పున భవన నిర్మాణ కార్మికులకు,ప్రతి హెల్పర్ బోర్డ్ సభ్యుడికి అందజేయాలని అన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, కరోనాతో మరణించిన నిర్మాణ కార్మికులకు 10 లక్షల ప్రమాద భీమా ఇవ్వాలని కోరారు. ప్రజలందరికీ మొబైల్ వెహికల్ ద్వారా కరోనా టెస్టులు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు ఉప్పతల వెంకన్న, ఉప్పతల గోవిందు, ఎస్ కే ముస్తఫా, శీలం వేణు, ఉప్పతల నరేష్, పల్లపు రామకృష్ణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిస్టర్ సెంటిమెంట్: షర్మిలమ్మకు రాజ్యసభ టిక్కెట్

Satyam NEWS

కరోనాతో కలుగులో దూరిన ఎమ్మెల్యేలూ ఎలా ఉన్నారు?

Satyam NEWS

ఎకరాకు 10వేలు

Murali Krishna

Leave a Comment