26.7 C
Hyderabad
May 3, 2024 08: 06 AM
Slider విజయనగరం

జీవిత జ్ఞానాన్ని నేర్పండి: ప్రతీ ఒక్కరూ చదువుకొనేలా చూడాలి

#suryakumariias

విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో బాటు, జీవిత జ్ఞానాన్ని కూడా పంచాలని, ఉపాధ్యాయులకు ఏపీలో ని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ చదువుకొనే విధంగా ప్రోత్సహించాలని, ఏ ఒక్క విద్యార్థీ, ఏ కారణం చేతా చదువుకు దూరం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.

జిల్లాలోని బాడంగి జిల్లాపరిషత్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ  కార్యక్రమం, సమగ్ర శిక్ష  ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని 1,70,232 మందికి 33,కోట్ల 43లక్షల ,35 వేల 648 విలువైన విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. అంతకు ముందు కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం జగన్ ప్రారంభించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా  ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో బాటు, జీవితానికి సంభందించిన ఇతర అంశాల పట్ల కూడా అవగాహన కల్గించి, అర్థవంతమైన జీవనాన్ని అలవాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఇంటర్ హెచ్ఈసి, సిఈసి గ్రూపుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని కలెక్టర్ చెప్పారు.

ఎంపి బెల్లాన చంద్రశేఖర్  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కేరళ కు ధీటైన విద్యావ్యవస్థను ప్రవేశపెట్టడం సీఎం లక్ష్యమన్నారు.. ఒక్కో విద్యార్థికి 1964 విలువైన అత్యంత నాణ్యమైన 8 రకాల వస్తువులతో విద్యా కానుకను అందించడం జరుగుతుందని చెప్పారు. త్వరలో 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను ఉచితంగా ట్యాబ్ లను అందజేయనున్నట్లు తెలిపారు.

సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పల నాయుడు మాట్లాడుతూ, విద్య కోసం ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.ఈ కార్యక్రమంలో కేజిబివి సెక్రటరీ నాగమణి, డీఈవో డాక్టర్ జయశ్రీ, సమగ్ర శిక్ష ఏపిసి డాక్టర్ స్వామి నాయుడు, జెడ్పీటీసీ పెద్దింటి రామారావు, ఎంపిపి బి. గౌరి, ఎంపీడీఓ బి.అక్కారావు, తాసిల్డార్ బాలమురళి కృష్ణ, ఎంఈఓ జి.కృష్ణమూర్తి, హెచ్ఎం  ఎస్ త్రినాధరావు, సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోన నుంచి రక్షణ కావాలంటే బయటకు రావద్దు

Satyam NEWS

కైకాల‌కు మెగా బ్ర‌ద‌ర్స్ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు

Satyam NEWS

16 నుంచి శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment