తమిళనాడులోని మధురైలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. విద్యార్థులను చికిత్స నిమిత్తం మధురై రాజాజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
previous post