28.7 C
Hyderabad
April 28, 2024 09: 05 AM
Slider కరీంనగర్

సీల్డ్ కవర్: వేములవాడ చైర్మన్ గా మాధవి వైస్ గా రాజేంద్ర

vemulawada muncipal elections chiraman madavi vice rajendra

వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలలో చైర్మన్ గా రామతీర్థపు మాదవి వైస్ చైర్మన్ గా మధు రాజేందర్ ఎన్నికయ్యారు.ఈ ఉదయం కాంప్ నుండి నేరుగా మున్సిపల్ సమావేశమందిరానికి చేరుకున్న తెరాస సభ్యులు ,వెనుకాలే చేరుకున్న బీజేపీ సభ్యులు ఇండిపెండెట్ కౌన్సిలర్లకు మున్సిపల్ కమిసినరు స్వాగతం పలికారు.వీరి రాకకు కార్యాలయాన్ని ముస్తాబు చేశారు.గెలిచినా 27 మంది సభ్యులతో పాటు ఎమ్మెల్యే రమేష్ బాబు సమావేశానికి హాజరయ్యారు.

మొదట సభ్యులతో ప్రమాణం చేయించిన కమిషనర్ తరువాత వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు.అధిష్టానం నుండి వచ్చిన సీల్డ్ కవర్ ను ఎమ్మెల్యే సబ్యులకు అందించగా అందులో ఉన్న 23 వార్డ్ అభ్యర్థి మధు రాజేంద్ర శర్మను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.వేములవాడ లో బ్రాహ్మణా వర్గాన్నికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఈ వార్డులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను వోడించినందుకు ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తుంది.అనంతరం చైర్మన్ గా 9 వార్డ్ సభ్యురాలుగా గెలిచినా రామతీర్థపు మాదవి పేరును సీల్డ్ కవర్ నుండి తెరిచి ప్రతిపాదించగా సభ్యులు బలపరిచారు.

వేములవాడ చైర్మన్ పదవికి బీజేపీ అభ్యర్థి గా ముప్పిడి సునంద పోటీచేయగా ఆమె కు బీజేపీ సభ్యులు మద్దతు పలికినప్పటికీ మెజారిటీ సభ్యులు బలపరిచిన మాధవి ఎన్నికయినట్లు కమిషనర్జే ప్రకటించాడు. కాగా బీజేపీ సభ్యురాలు ప్రతాప హిమబిందు సమావేశానికి గైర్హాజరయ్యారు.

చైర్మన్ గా ఎన్నికైన రామతీర్థపు మాదవి వేములవాడ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు భార్య .పట్టణం లో ప్రజాదరణ కలిగిన నేత గా రాజుకు గుర్తింపు ఉంది.నిత్యం ప్రజాసమస్యల సాధనకు ఆయన ప్రజలతో మమేకమవుతుంటాడు.కాగా సామజిక పరంగా అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపు వర్గానికి చెందిన మాదవి కౌన్సెలర్ గా రెండో సారి విజయం సాధించింది.రిజర్వేషన్ లో తన వార్డ్ పోయినప్పటికీ పక్క వార్డ్ కు వెళ్లి పోటీచేయడం తో పాటు గన్ షాట్ గా గెలుస్తాడుఅనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సాగరం వెంకట స్వామి పై భారీ మెజారితో గెలిచినందుకు, అనుభవం,ప్రజాదరణ దృష్ట్యా వారికి ఈ పదవి దక్కినట్లు,ఒత్తిడి ఉన్న వీరివైపే ఎమ్మెల్యే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.గతం లోనేమాదవి చైర్మన్ కావాల్సి ఉండగా అప్పుడు అప్పుడు నిరాకరించిన ఎమ్మెల్యే భవిష్యత్ లో అవకాశం ఇస్తానని ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యే రమేష్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమెను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం.

దీనితో వీరిరువురు ఎన్నికయినట్లు కమిషనర్ ప్రవీణ్ ప్రకటించారు.ఎక్స్ ఆఫీసియో సభ్యుడుగా హాజరైన ఎమ్మెల్యే రమేష్ బాబు వీరిని అభినందించారు. కాగా ఎన్నికల్లో అంతకు ముందు పార్టీ కోసం తీవ్రం గా శ్రమ పడ్డ యాచమనేని శ్రీనివాస రావుకు నిరాశే ఎదురయ్యింది.వైస్ చైర్మన్ గా ఆయనను ఎమ్మెల్యే ఎంపిక చేస్తారనుకున్నప్ప్టికి సమీకరణాల నేపథ్యం లో ఆయనకు ఏ పదవి దక్కలేదు.కాగా ఆరుగురు సభ్యులు ఎన్నికైన కొండా కుటుంబానికి ఎమ్మెల్యే రమేష్ బాబు చైర్మన్ గాఎందుకు అవకాశమివ్వలేదో అర్థం కావడం లేదని ప్రజలు గుసగుస లాడుతున్నారు.

Related posts

పి సి.సి. కార్యదర్శిగా ఈడ్పుగంటి సుబ్బారావు

Satyam NEWS

సోయా పంట చేలను పరిశీలించిన శాస్తవ్రేత్తలు

Satyam NEWS

గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

Bhavani

Leave a Comment