38.2 C
Hyderabad
April 29, 2024 20: 47 PM
Slider ఖమ్మం

మాఫియాను అదుపు చేసేందుకు టాస్క్ ఫోర్సు

#KhammamPolice

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన  టాస్క్‌ఫోర్స్ విభాగంలో సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకుని కమిషనరేట్ పరిధిలో  అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్‌ ప్రాధాన్యం, నిర్వహించాల్సిన విధులు, విధివిధానాలపై, ప్రాపర్టీ రికవరీ ,నేరస్ధులపై నిఘా తదితర ఆంశలపై సిసిఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ) అధికారులతో పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమైయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు పుట్టుకొచ్చిన  నకిలీ సంస్థలు, నకిలీ ఉద్యోగాల పేరుతో  మోసాలు, భూకబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా, రౌడీషీటర్లు, అక్రమ్ర రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, కల్తీ ఆహారం నిల్వలపై టాస్క్‌ ఫోర్స్‌ ప్రధానంగా దృష్టిసారించాలని  మార్గదర్శకాలు జారీచేశారు.

గుట్కా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేసి నగరంలో సరఫరా చేస్తున్న హోల్‌సేల్‌ డీలర్లను గుర్తించి వారిని కటకటాల వెనక్కి పంపాలని అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యాపారాలు సాగించే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.

చిన్న చిన్న గ్యాంగ్ లు చేసే  చిల్లర పనులే రేపటి రోజున ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కాబట్టి  వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి,మాదకద్రవ్యాల  వంటి మత్తుపదార్థాల విక్రయాల ముఠాలపై పూర్తిస్థాయిలో  నిఘా పెట్టి  కట్టుదిట్టం చేయాలని   అధికారులకు ఆదేశించారు.  జిల్లాలో  ఎక్కడైనా యువతకు గంజాయి సరఫరా జరుగుతున్నట్లు సమాచారం వస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.  ఏలాంటి  ఆరోపణలు తావు లేకుండా టాస్క్ ఫోర్స్ సిబ్బంది భాద్యతయుతంగా నడుచుకొవాలని అన్నారు.

అదేవిధంగా సిసిఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ) సిబ్బంది ప్రాపర్టీ రికవరీ ,నేరస్ధులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఏవరైనా  అత్యుత్సాహం ప్రదర్శించిన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణ వచ్చిన శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని  పోలీస్‌ కమిషనర్‌ టాస్క్ ఫోర్స్, సిసిఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ) సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. సమావేశంలో టాస్క్ ఫోర్స్ రామానుజం, సిసిఎస్.ఎసీపీ జహాంగీర్ , టాస్క్ ఫోర్స్, సిసియస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మళ్ళీ జగనొస్తే…. రాజధాని భూములన్నీ అమ్మేస్తాడు!

Satyam NEWS

కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం..

Bhavani

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

Satyam NEWS

Leave a Comment