26.7 C
Hyderabad
May 3, 2024 10: 50 AM
Slider నల్గొండ

టి.బి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలి

#TBEradication

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ లింగగిరి గ్రామ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో క్షయ  వ్యాధినిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హర్షవర్ధన్, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2025 నాటికి క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు.

ఎవరికైనా దగ్గు, ఆకలి మందగించడం, రాత్రి సమయంలో జ్వరం,  బరువు తగ్గడం, కళ్ళెలో రక్త జీరలు కనబడినట్లయితే దగ్గర లోని ఆశ కార్యకర్తను సంప్రదించి క్షయ  నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

క్షయ నిర్ధారణ అయిన వ్యక్తికి ఉచిత మందులు, పోషక ఆహార  నిమిత్తం వారికి నెలకు 500 రూపాయలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. క్షయరోగి మందులు వాడనట్లయితే ఒక సంవత్సర కాలంలో 8 నుంచి 12 మందికి ఆ వ్యాధిని ఇతరులకు అంటించే అవకాశం ఉందని, కనుక వ్యాధి లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకుని తప్పక మందులు వాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి Dr. లక్ష్మణ్ గౌడ్, పి. హెచ్.న్. ప్రమీల, T.B నోడల్ పర్సన్ ఇందిరాల రామకృష్ణ,STS లు మమత , బందెల రాములు, T.కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, సోని ల్యాబ్ టెక్నీషియన్లు ఉపేందర్, ప్రసాద్ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

Related posts

రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే

Satyam NEWS

అమరావతి ల్యాండ్ స్కాం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు

Satyam NEWS

సంచలనాత్మక సంఘటనలు వెల్లడించనున్న ఎల్ వి సుబ్రహ్మణ్యం

Satyam NEWS

Leave a Comment