40.2 C
Hyderabad
April 28, 2024 16: 44 PM
Slider వరంగల్

స్వధార్ ఆశ్రయంకు ఆహార పదార్ధాల అంజేత

#anitareddy

బాలికా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా హన్మకొండ లోని స్వధార్ ఆశ్రయంలో నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి పావని అనే అమ్మాయి కి ఉచితంగా ఉష కుట్టు మిషన్ అందచేశారు. మహిళల జీవితానికి భరోసా కల్పించడానికి  కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న యువతికి ఈ పని చేసినట్లు అనితారెడ్డి తెలిపారు. అదే విధంగా స్వధార్ ఆశ్రయం కోసం బియ్యం బస్తాలు, కంది పప్పు, పండ్లు అందచేశారు.

అనంతరం జెండర్ ఈక్వాలిటి బాలికల ప్రాముఖ్యత, మహిళ సాధికారత అంశాలపై అవగాహన కల్పించారు. చట్టాల పట్ల అవగాహన ఉంటేనే చట్టాలను వినియోగించు కోగలుగుతారని, ప్రశ్నించేతత్వాన్ని అలవరచుకోవాలని తమ హక్కు లను కాపాడుకోవాలని అన్నారు. అలాగే మహిళ లు స్వయం ఉపాధి శిక్షణ లలో రాణించి ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే స్తాయిలో ఉండాలని, జీవితం లో వచ్చిన కష్టాలను మరచిపోయి పాజిటివ్ థింకింగ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నుంచి మెగాస్టార్ చిరంజీవికి రిలీఫ్

Satyam NEWS

నిర్లక్ష్యం వద్దు

Sub Editor 2

ములుగు బస్టాండ్ లో ఆగని చోరీలు: పనిచేయని సీసీ కెమెరాలు

Satyam NEWS

Leave a Comment