42.2 C
Hyderabad
May 3, 2024 17: 52 PM
Slider ఆంధ్రప్రదేశ్

సాడ్ న్యూస్:టీడీపీ నేత బడేటి బుజ్జి హఠాన్మరణం

tdp leader

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.

ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలిపారు. బుజ్జి మరణవార్తతో టీడీపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. బుజ్జి పూర్తి పేరు బడేటి కోటి రామారావు. బుజ్జిగా చిరపరిచితులు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావుకు ఆయన స్వయాన మేనల్లుడు.

2014-19 మధ్య ఏలూరు ఎమ్మెల్యేగా సేవలు అందించిన బుజ్జి గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. బుజ్జి మరణవార్త తెలిసిన అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

Related posts

పాండిచ్చేరి స్వతంత్ర అభ్యర్ధి కాకినాడలో అపస్మారక స్థితిలో…

Satyam NEWS

మ్యాచింగ్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచార కేంద్రం

Satyam NEWS

రక్తదానంతో ప్రాణం నిలిపిన జన చైతన్య ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment