27.7 C
Hyderabad
May 4, 2024 09: 45 AM
Slider గుంటూరు

రాష్ట్ర ప్రజానీకం ఐ.సీ.యూ లో ఉంది

#TDPnarasaraopet

రాష్ట్ర ప్రజానీకం ఐ.సీ.యూ లో ఉందని, ఇటువంటి పరిస్థితులలో వైద్యం తెలిసిన సరైన వైద్యుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. స్థానిక నరసరావుపేట పట్టణంలో ఎన్జీవో కాలనీ లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ ప్రపంచం గర్వించ దగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆనాడే శిరస్సు వంచి రాష్ట్ర ప్రజానీకానికి చెప్పకనే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు సంక్షేమ పథకాలతో ప్రజలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

కానీ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చాలా మంది ఉద్యోగస్తులు జగన్ కావాలి, రావాలి అన్నారు. ఈనాడు ఉద్యోగస్తుల పరిస్థితి దయనీయకరంగా ఉంది అని అన్నారు. పీఆర్సీ ఫిట్మెంట్ లేదు, డీఎలు లేవు, ప్రావిడెంట్ ఫండ్ గోల్మాల్, ఉద్యోగస్తులకు ఇవ్వవలసిన కనీస వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అన్నారు.

యువతకు ఉపాధి లేదు. యువత కూడా ఊహించి ఉండరు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని చికెన్,మటన్,ఫ్రాన్స్ మాల్ లలో పని చేయవలసి వస్తుందన్నారు. నదీ పరివాహక ప్రాంతాల పక్కన ఉండి కూడా గుప్పెడు ఇసుకను తెచ్చుకోవాలంటే వేల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఉంది అని ఎద్దేవా చేశారు.

ఇష్టానుసారంగా నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు,చెరువులు, సైడ్ కాలువలు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పట్టణానికి రావాలన్న గ్రామ రోడ్ల పై తిరగాలన్నా ఎడ్లబండ్ల పై రావాలి అని రాజకీయం ఎలా చేయాలో వైసీపీ నాయకులు నేర్పిస్తున్నారని అట్టుకు అట్టునరా పెడదాం, అవసరమైతే బిర్యాని కూడా పెడదాం అని హెచ్చరించారు.

తిరిగి 2024 లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా శ్రమించి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

నటులు కైకాల కన్నుమూత

Murali Krishna

కొల్లాపూర్ లో ఆ ఎన్నికలకు సర్వంసిద్ధం..నోటిఫికేషన్ ఆలస్యం

Satyam NEWS

ఆదివాసీలకు శాపంగా మారిన కేసీఅర్ పాలన

Satyam NEWS

Leave a Comment