28.7 C
Hyderabad
May 5, 2024 08: 20 AM
Slider కడప

ముస్లింలపై జరుగుతున్న దాడులపై టీడీపీ నేత భత్యాల నిరసన

#bhatyala

అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే ముస్లింల మానప్రాణాలకు రక్షణ కరువైందనే విషయం స్పష్టమౌతుందని అన్నారు.

గడచిన మూడున్నరేళ్ళలో ముస్లిం సామాజిక వర్గంపై 48 దాడులు జరిగాయని అందులో మానభంగాలు, దాడులు,హత్యలు,కబ్జాలు ఉన్నాయని పేర్కొన్నారు. జరిగిన దాడులలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళనలు చేపడుతుందని తెలియజేశారు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుమతితో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ను ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతగా అభిమానం టి 90శాతం ముస్లింలు ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేశారని అన్నారు.

పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి మరియు ముస్లిం మైనారిటీ నాయకుడు అబూబకర్ మండెం మాట్లాడుతూ రాష్ర్టవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఇటీవల నరసరావుపేటలో మసీదు వివాదంలో అభ్యంతరం తెలిపిన షేక్ ఇబ్రాహీం(70)అనే వృధ్ధుడిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన దోషులను,అలాగే గోరంట్లలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సాదిక్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి మహిళల సమక్షంలో అతని పై దాడికి తెగబడిన సంఘటనలను విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు,రూరల్ అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్య,మైనారిటీ నాయకులు పీరూసాహెబ్,కరీం,కరీముల్లా మండెం,అష్రఫ్ ఖాన్,ఒంటిమిట్ట వీరభద్రుడు,మాధవరం ఖాదర్ బాష,కేశవ,అనసూయమ్మ,మిరియాల జ్యోతి,మందా శ్రీను,టి.యన్.యస్.ఎఫ్ వేణు,రాంనగర్ నరసింహ,వత్తలూరు వెంకటసుబ్బయ్య,కొల్లి రెడ్డెయ్య,జడ శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేలను ముద్దాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

Satyam NEWS

సామాజిక సేవలో పిఎస్ఆర్ ట్రస్ట్

Bhavani

స్కూల్ ఎన్నికల నిర్వహణపై కార్యశాల

Bhavani

Leave a Comment