కొత్త సంవత్సరం జరుపుకోకుండా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. అమరావతి లోనే రాజధాని ఉండాలని ఆందోళనలు చేస్తున్న రైతులను నేడు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలను చేసిన భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు.
ఆర్ధిక నేరస్తులు పరిపాలన చేపడితే ఇదే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, ఇమ్మడిశెట్టి కాశయ్య, మీరావలి,బోస్ తదితరులు ఉన్నారు.