29.7 C
Hyderabad
May 3, 2024 07: 01 AM
Slider మెదక్

ఉపాధ్యాయ దంపతుల సమస్యలను పరిష్కరించాలి: వై.ఎస్. శర్మ

#teachers

ఉపాధ్యాయ దంపతులు జీవో 317 వల్ల 13 జిల్లాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు,  పిటిఎ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్. శర్మ డిమాండ్ చేశారు.  రాష్ట్రపతి ఉత్తర్వులు 2018  ప్రకారం 20021 డిసెంబర్లో నూతన జిల్లాలకు ఉద్యోగ ఉపాధ్యాయులను కేటాయింపులు చేశారన్నారు.  వీటిలో మెమో 1655 ప్రకారం 13 జిల్లాల్లో నష్టపోయిన ఉపాధ్యాయ దంపతుల దీర్ఘకాల సమస్యలను సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని పరిష్కరించాలన్నారు.

స్థానికత ఆధారంగా ఉద్యోగులను వారి వారి జిల్లాలకు కేటాయించాల్సింది ఓయ్ సతాయించడం సరికాదన్నారు. 317 జీవో అమలులో రాష్ట్ర విద్యాశాఖ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులు తప్పుదోవ పట్టించడమే కాక ఏడాదికి పైగా అప్పీల్ల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 13 జిల్లాలను స్పౌజ్ లకు బ్లాక్ చేయడం తీవ్ర అన్యాయమని,  దొడ్డిదారిన బదిలీలకు మార్గం సుగమం. చేసుకునేందుకే విద్యాశాఖ 615 మంది స్పౌస్ బదిలీలని చేపట్టి,  దంపతుల బదిలీలుగా చూపిందన్నారు. స్పౌజ్ లు వారికి న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ ముట్టడి మౌన దీక్షకు తమ ఏఐపిటిఎఫ్, పిటిఏ టిఎస్ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగిందని అన్నారు. ఇందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్

Satyam NEWS

అంతర్జాతీయ ప్రయాణం ఇకపై ప్రధాన టెర్మినల్‌ నుండి

Satyam NEWS

పాములు వస్తున్నాయి మమ్మల్ని కాపాడండి

Satyam NEWS

Leave a Comment