39.2 C
Hyderabad
May 4, 2024 22: 02 PM
Slider వరంగల్

నిరుద్యోగ గిరిజనులకు ములుగులో జాబ్ మేళా

#jobmela

గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగులో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 22 ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 784 మంది గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కాగా 399 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారు. ఎంపిక అయిన అభ్యర్థులకు రాబోవు రెండు రోజులలో అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి ట్రైనింగ్ కల్పించి ఉద్యోగంలో చేర్చుకుంటారు.

ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు 15000 వేల నుండి 35 వేల  వరకు వారి అర్హతను బట్టి సంబంధిత కంపెనీ వారు నిర్ణయిస్తారు. ఈ జాబ్ మేలాకు హాజరైన గిరిజన యువతీ యువకులకు భోజన వసతి మరియు మంచినీటి వసతి కల్పించారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ఐటీడీఏ ఏటూరునాగారం APO(GL) జే వసంతరావు స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి డి ఆర్.డి. ఓ.లు ములుగు, జే ఎస్ భూపాలపల్లి మరియు మహబూబాబాద్ జిల్లాల  సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ జి.దేశి రామ్, ఏపీడి ములుగు శ్రీనివాస్, డిప్యూటీ డీఈవో డి సారయ్య, డిప్యూటీ ఎస్ఓ బి లాల్, డిపిఎం ఏ సతీష్, జేడియం కొండలరావు, ఉమ్మడి జిల్లాలోని, ఏపిఎం, జేఆర్పీలు,ఐటీడీఏ ఉద్యోగులు, లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ సుధాకర్, హెచ్ డబ్ల్యుఓ వెంకట రంగారావు ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

మునిసిపల్ గెలుపుతో వైసీపీలో నూతనోత్సాహం

Satyam NEWS

ప్రభుత్వ మద్యం దుకాణాలకు జగనన్న పేరు పెట్టాలి

Satyam NEWS

అయోధ్య రాముడి మందిరానికి అందరూ సహకరించండి

Satyam NEWS

Leave a Comment