37.2 C
Hyderabad
May 6, 2024 23: 03 PM
Slider శ్రీకాకుళం

బోన్ క్యాన్సర్ పాపకి ఉపాధ్యాయుల ఆర్థిక సహాయం

#ContractTeachers

ఎముకల క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్సకు ఆర్ధికంగా సాయం కోసం ఎదురు చేస్తున్న బాలికకు ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయులు మేమున్నాం అంటూ ఆదుకున్నారు.

శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామంలోని పొందర వీధికి చెందిన గంగాధర హారిక (12) ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్నది.

వైద్యానికి లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో విషయం తెలుసుకున్న పెద్దపాడు ఉన్నత పాఠశాల, తంగి వాణి పేట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయులు గుండ బాల మోహన్, కింజరాపు నరేష్ ఆసుపత్రి ఖర్చులకు రూ.7000 అందించారు.

ఈ పాప తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఆమె పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. పాప పరిస్థితి బట్టి సహాయం అందించే  దాతలు ముందుకు రావాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.  

పాపకు ఆర్థిక  సహాయం చెయ్యవలసిన  సెల్ నెంబరు 7093992533, ఫోన్ పే నెంబర్ 9182018180 గోవిందరావు, బ్యాంక్ ఎకౌంటు నెంబరు 73153213321, ఐ.ఎఫ్.ఎస్సి. కోడ్. నెంబరు ఏ.పీ.జీ.వీ.బీ 0001182, పెద్దపాడు  బ్రాంచ్, శ్రీకాకుళం రూరల్ మండలం.

Related posts

కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు

Satyam NEWS

అభం శుభం తెలియని చిన్నారిపై ఘాతుకం

Satyam NEWS

రూ. 76 లక్షలు హవాలా నగదు స్వాధీనం

Bhavani

Leave a Comment