37.2 C
Hyderabad
May 2, 2024 13: 28 PM
Slider రంగారెడ్డి

కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు

#sabitaindrareddy

విద్యారంగంతో పాటు ఏ రంగంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయ సహకారాలు అందటంలేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం  ఉప్పల్ సర్కిల్ పరిధిలో  చిల్కానగర్ డివిజన్ లోనీ నూతన లైబ్రెరీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని  పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణకి ఎలాంటి సహాయ సహకారాలు అందించని బీజేపీకి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నేడు మేడ్చల్ ఒకటి, ఉప్పల్ లో ఒకటి మొత్తం రెండు లైబ్రరీలు ప్రారంభించమన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 లైబ్రరీలు నిర్మించనున్నామనీ తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు ఒక లైబ్రెరీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Related posts

కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి

Bhavani

సొంత ఆస్తులు పంచుతున్నావా? ప్రతిదానికీ నీ పేరెందుకు?

Satyam NEWS

పరీక్షల సమయంలో విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్లాలి

Satyam NEWS

Leave a Comment