26.7 C
Hyderabad
May 3, 2024 08: 29 AM
Slider ముఖ్యంశాలు

టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియ ప్రారంభం

#education

టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబ‌ర్ 5ను గురువారం జారీ చేశారు. శుక్ర‌వారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. రేపు కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్​ఈవోలకు.. మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాలి.

Related posts

డైమండ్ వార్:వృద్ధుడిని చితక బాది వజ్రం దోచుకెళ్లారు

Satyam NEWS

ప్రభుత్వ ఉగ్రవాద చర్యల పై చంద్రబాబు దీక్షకు మద్దతు

Satyam NEWS

ఎన్నిక‌ల్లో భారీ పోలీసు బందోబ‌స్తు..

Sub Editor

Leave a Comment