30.7 C
Hyderabad
April 29, 2024 05: 40 AM
Slider నిజామాబాద్

భారత్ జోడో యాత్ర చరిత్రాత్మకం: షబ్బీర్ అలీ

#shabbir

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్రాత్మకమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. దానికి కొనసాగింపుగానే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు. కాలనిలో పాదయాత్ర చేపట్టారు. కాలనీ ప్రజలు షబ్బీర్ ఆలీకి ఘనస్వాగతం పలికారు. తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో ఆయాత్ర నేటితో 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుందన్నారు.

జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రజల స్పందనను చూసి బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. దమ్ముంటే ఒక్కరోజు రాహుల్ గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీ నాయకులకు సూచించారు. ప్రజల నాయకుడంటే రాహుల్ గాంధీల ఉండాలన్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ అనేక సమస్యలు తెలుసుకున్నారన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. భారత్‌ జోడో యాత్రలోని విశేషాలను వివరించడంతో పాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. భారత్ జోడో యాత్ర చివరి దశలో ఉందని, పాదయాత్ర జనవరి 30న ముగుస్తుందని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేస్తారని, పార్టీ కార్యకర్తలు కూడా దేశంలోని పార్టీ జిల్లా కార్యాలయాల్లో జెండాను ఎగర వెయ్యాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలపై తమ పార్టీ నుంచి ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు. గత నాలుగేళ్లుగా మహిళా సంఘాలకు రావలసిన వడ్డీ లేని రుణాల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఇవ్వడం లేదన్నారు.

అభయ హస్తం పథకాన్ని కూడా నిలిపివేశారని, అభయ హస్తం కింద ఆడపడుచులు కట్టిన డబ్బులు కూడా తిరిగి మహిళలకు ఇవ్వడం లేదన్నారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని, మహిళలకు రావలసిన అనేక పథకాలు ప్రభుత్వం ఎత్తి వేసిందన్నారు. పేద ప్రజలకు విద్యుత్ బిల్లు మోపుతున్నారని, కట్టడానికి డబ్బులు లేవంటే ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.

బీడీ కార్మికులను రోడ్డుపైకి తీసుకువచ్చి ఉపాధి లేనివారిగా చేసే కుట్ర జరుగుతుందని, బీడీపై 28% జీఎస్టీ వేసి బీడీ కార్మిక రంగాన్ని కోలుకోకుండా చేశారని ఆరోపించారు. బీడీ వ్యవస్థనే రద్దు చేసే కుట్ర జరుగుతుందని, పార్లమెంట్లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు అన్నీ ఏకమై బిడి రంగం రద్దు కాకుండా ఇప్పటికైతే ఆపగలిగామన్నారు. త్వరలో బీడీ కార్మికులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలందరి సమస్యలు తీరుస్తుందన్నారు.

Related posts

పాలన చూడని మంత్రులు పవన్ గురించి మాట్లాడుతున్నారు

Satyam NEWS

కోలాటాలతో కామన్నవలసలో స్వాగతం…!

Satyam NEWS

బాధ్యత మరచిన కొత్తగూడెం డిఎస్పీ పై పోలీసు కేసు

Satyam NEWS

Leave a Comment