28.7 C
Hyderabad
May 6, 2024 07: 44 AM
Slider క్రీడలు

టీ20 ప్రపంచ కప్‌ నుంచి పేలవమైన ఆటతో కోహ్లీ సేన ఔట్

టీ20 ప్రపంచ కప్ 2021 షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఈ టోర్నమెంట్‌లో టీమిండియా అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో కూడిన జట్టు ప్రత్యర్థులకు దడ పుట్టిస్తుందని అనుకున్నారు.

కానీ, టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు చాలా పేలవమైన ప్రదర్శనతో సూపర్-12 రౌండ్‌లోనే నిష్క్రమించింది. చివరి ఆశగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ టీం కూడా హ్యాండివ్వడంతో కోహ్లీసేన బ్యాచ్ దుబాయ్‌ నుంచి బ్యాగులు సర్దుకోనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ టీం గ్రూపు 2 నుంచి సెమీఫైనల్ చేరింది.

ఇదే గ్రూపు నుంచి పాకిస్తాన్ సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. గ్రూపు 1 నుంచి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టీంలు, గ్రూపు 2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. 2007లో టీ20 చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. టోర్నీలో టీమ్ ఇండియా చాలా పేలవంగా ప్రారంభమైంది.

పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత, న్యూజిలాండ్ టీం కూడా భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రెండు పరాజయాలు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. తరువాతి రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ, అవి సెమీస్ చేర్చలేకపోయాయి.

Related posts

వివాదాస్పదమవుతున్న రైతు వేదికలు

Satyam NEWS

తెలంగాణా ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసల జల్లు

Satyam NEWS

జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వని మోడీ, అమిత్ షా

Satyam NEWS

Leave a Comment