అకస్మాత్తుగా ఢిల్లీ పయనమై వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ కానీ, హోం మంత్రి అమిత్ షా కానీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు.
వారిద్దరి అప్పాయింట్ మెంట్ కోసం వైసిపి నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి విశ్వప్రయత్నం చేసినా కుదరలేదు. ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ కోరేందుకు కూడా వీరికి అవకాశం దొరకలేదు. అమిత్ షా అతి ముఖ్యమైన కార్యక్రమాల దృష్ట్యా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేనని చెప్పారు. దాంతో వై ఎస్ జగన్ బృందానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఢిల్లీ వరకూ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణమయ్యారు.
వైయస్ కుటుంబంతో 3దశాబ్దాలకుపైగా అనుబంధం ఉన్న నారాయణ ఆకస్మికంగా మరణించడంతో జగన్ ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్‌పోర్టుకు అక్కడ నుంచి నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకోనున్నారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.