37.2 C
Hyderabad
April 26, 2024 21: 59 PM
Slider ప్రపంచం

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు క్లీన్‌చిట్‌

ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ముంబై దాడుల కీలక సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులను పాకిస్థాన్‌లోని లాహోర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత జమాతుల్ దవా (JUD) కు చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.

2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలో జేయూడీ సంస్థ ఉగ్రకార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇది లష్కరే తొయిబాకు (LET) అనుబంధ సంస్థగా ఉంది. ఈ సంస్థ ఉగ్ర కార్యకాలపాలకు ఉగ్రవాదులకు నిధులు సమకురుస్తుందన్న అభియోగాలపై పలు కేసులు నమోదయ్యాయి.

టెర్రరిస్టు సంస్థలకు నిధులు సమకూరస్తున్న ఆరోపణల నేపథ్యంలో ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్ ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది. ప్రపంచ FATF సంస్థ ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైనందుకు పాకిస్తాన్‌ను ఆ సంస్థ ‘గ్రే లిస్ట్’లో ఉంచిన తర్వాత ఈ తీర్పు రావడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

నూతన రెవిన్యూ చట్టంలో లోపాలున్నాయి

Satyam NEWS

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర పై వ్యాసరచన పోటీలు

Satyam NEWS

పదో తరగతి ఫలితాల్లో  బిసి గురుకుల విద్యార్థుల ప్రభంజనం

Satyam NEWS

Leave a Comment