39.2 C
Hyderabad
May 3, 2024 12: 48 PM
Slider హైదరాబాద్

15-18 వయసు కలిగిన టీనేజీ పిల్లలు తప్పకుండా టికాలు వేసుకోవాలి

#devireddysudheerreddy

ఒమిక్రాన్ నేపథ్యంలో ఎల్.బి.నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థి,విద్యార్థులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ మోతాదు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.

2007 లేదా అంతకు ముందు పుట్టిన వారు అందరూ అర్హులని తెలిపారు. వీరి కోసం ప్రభుత్వ వైద్యంలో గ్రామీణ,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

కోవిన్ యాప్ నందు లేదా వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలి అని తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులచే మాట్లాడి స్కూల్ ఆవరణలో వ్యాక్సినేషన్ సెంటర్ ఎర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే వైద్యుడి పర్యవేక్షణలో తల్లిదండ్రుల సమక్షంలో వ్యాక్సిన్ వేస్తారు అని తెలిపారు.

అలాగే పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సుధీర్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. గుంపులు,గుంపులు ఉన్న ప్రదేశంలో తప్పకుండా మాస్కులు విధిగా ధరించాలి అని తెలిపారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ కరోనను దరిచేయకుండా చూసుకోవాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లింగోజిగూడా మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు,లింగోజిగూడా డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు వర ప్రసాద్ రెడ్డి, ఆడల రమేష్, తిలక్ రావు, నర్రె.శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, భాస్కర్ గంగపుత్ర, శ్రవణ్ కుమార్,మధు సాగర్,రాకేష్,సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరంలో తగ్గిన పోలీసు “స్పందన” బాధితుల సంఖ్య

Satyam NEWS

నారాయణ నారాయణా ఏమిటీ ఆన్ లైన్ వేధింపులు?

Satyam NEWS

హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయి సినీ సిటీ

Satyam NEWS

Leave a Comment