38.2 C
Hyderabad
April 29, 2024 21: 25 PM
Slider విజయనగరం

విజయనగరంలో తగ్గిన పోలీసు “స్పందన” బాధితుల సంఖ్య

#spandana

గడచిన నెల రోజులుగా విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీసు బాస్ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం జరుగుతున్న “స్పందన”కు రమారమి 35 మందికి తగ్గకుండా బాధితులు తమతమ బాధలను.. గోడు ను వెళ్లబోసుకుంటున్నారు. కానీ తాజా ఈ వారం 8వ తేదీన జరిగిన “స్పందన”నకు బాధితులు సంఖ్య తగ్గడంతో… నేరాల పట్ల… సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు బాస్ అయిన ఎస్పీ దీపికా చర్యలు ఫలితాలను ఇస్తున్నాయనటానికి.. బాధితుల సంఖ్య తగ్గడమే కారణమని “సత్యం న్యూస్. నెట్” అభిప్రాయపడుతోంది.

ఈ మేరకు  జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ “స్పందన” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 30 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరం కాళీఘాట్ కాలనీకి చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తనకు గల ఇంటి అద్దె ఇచ్చినట్లు, సదరు వ్యక్తులు ఇంటిని ఖాళీ చేయడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాధికి న్యాయం చేయాలని టౌన్  సీఐను ఆదేశించారు.

బొబ్బిలికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వేరే అమ్మాయిని ప్రేమించి, పెండ్లి చేసుకున్నానని, తనకు బ్రతకు తెరువుకు తన తండ్రికి గల వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని ఇప్పించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు కుటుంబాలను పిలిపించి, కౌన్సిలింగు నిర్వహించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సిఐనుఆదేశించారు.

విజయనగరం గాజులరేగ ప్రాంతానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన ప్రాంతానికి చెందిన మరో మహిళ విశాఖపట్నంలో ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి, తన వద్ద నుండి 45,500/- లు తీసుకొని, మోసం చేసినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని టౌన్  సీఐను ఆదేశించారు.

గజపతినగరం మండలంకు లింగాలవలస కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తాను కష్టపడి సంపాదించుకున్న భూమిని తన అన్నదమ్ములు పంచమని బెదిరిస్తున్నారని, తనపై దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధి లో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి డిఎస్పీని ఆదేశించారు.

పూసపాటిరేగ మండలం నడిపిల్లి కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తనకు గల వ్యవసాయ భూమి చుట్టూ ఫెన్సింగు వేసుకోగా, అదే ప్రాంతానికి కొంతమంది వ్యక్తులు తన స్థలంను ఆక్రమించుకోవాలనే దురుద్దేశ్యంతో ఫెన్సింగును ధ్వంసం చేసారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ఐను ఆదేశించారు.

విశాఖ కు చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు విజయనగరం బిట్ నంబరు 2లో గల స్ధలంను వైఎస్ఆర్ నగర్ కు చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించు కోవాలనే దురుద్ధేశ్యంతో జెసిబితో స్ధలం మీదకు వచ్చి, తమపై దౌర్జన్యం చేస్తూ, తమపైనే తిరిగి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని టూటౌన్  సీఐను ఆదేశించారు.

“స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బి సిఐ జె. మురళి, ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఎస్ఐలు వాసుదేవ్, లోకేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

గోవా లో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత

Satyam NEWS

ఈ విద్యా సంవత్సరం నుండే 4 ఏకలవ్య మోడల్ స్కూల్స్

Satyam NEWS

ప్రపంచ దేశాలకు మందులు ఇచ్చే స్థాయికి రావడం గర్వకారణం

Satyam NEWS

Leave a Comment