28.7 C
Hyderabad
May 6, 2024 07: 54 AM
Slider ప్రత్యేకం

శ్రమజీవుల చెమట చుక్కలే అభివృద్ధికి ఆలంబన

#Telangana CM KCR 2

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక కష్ట జీవులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే  అభివృద్ది సాధ్యమైందని, మానవజాతి పురోగతి, కష్టం చేసే చేతుల మీదినించే కొనసాగుతూ వస్తున్నదని  సిఎం తెలిపారు.

వివిధ ఫాక్టరీల్లో పనిచేసే కార్మికులతోపాటు, వ్యవసాయాధారిత భారత దేశంలో అధిక జనాభా భూమిని నమ్ముకుని బతుకుతున్నారని పేర్కొన్నారు.

రైతులుగా,కూలీలుగా,వ్యవసాయ అనుబంధ వృత్తి కులాలుగా తమ శ్రమను ధారపోస్తూ దేశ, రాష్ట్ర అభివృద్దిలో వారు భాగస్వాములైనారని సిఎం అన్నారు.  మేడే స్పూర్తితో సబ్బండ వృత్తి కులాల సంక్షేమం, అభివృధి కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలూ కృషి చేస్తుందని, ఆదర్శవంతమైన కార్మిక కర్షక విధానాలను అమలు పరుస్తున్నదని సిఎం స్పష్టం చేశారు.

వృత్తి కులాల కోసం, పేరు పేరునా అమలు చేస్తున్న పథకాలు వారి సామాజిక ఆర్ధిక అభివృద్దికి దోహదం చేస్తున్నాయని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని సిఎం వివరించారు.

 ఉత్పత్తి సేవా రంగాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పారిశ్రామిక విధానం తెలంగాణ లో సంపద సృష్టితో పాటు లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడుతున్నదని సిఎం కెసిఆర్ మేడే సందర్భంగా తెలిపారు.

Related posts

థాయ్ బాక్సింగ్ తో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్

Satyam NEWS

క‌న్యకాప‌ర‌మేశ్వ‌రి స‌న్నిధిలో నారాయ‌ణ‌

Satyam NEWS

ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ లో భారీగా చేరికలు

Satyam NEWS

Leave a Comment