31.7 C
Hyderabad
May 2, 2024 10: 17 AM
Slider మహబూబ్ నగర్

డాక్టర్లను కాపాడలేకపోతున్న తెలంగాణ రాష్ట్రం

#D K Aruna

దేశం లోని నెంబర్ వన్ అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం లో కరోనా టెస్టులు చేయడంలో పూర్తిగా వెనకబడిందని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. తమిళనాడు 5 లక్షల 28వేలు పైగా టెస్టులు చేస్తే, మహారాష్ట్ర 4 లక్షల 98 వేల కరోనా టెస్టులు చేశారని అయితే తెలంగాణ లో చేసిన టెస్టులు 40వేల మాత్రమేనని ఆమె అన్నారు.

రాష్ట్రం లో డాక్టర్ల ప్రాణాలకే ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోతుందని ఆమె అన్నారు. తెలంగాణలో 68 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని అరుణ అన్నారు. ఉస్మానియాలో 41 మంది డాక్టర్లు, గాంధీలో నలుగురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. నిమ్స్‌లో 12మంది డాక్టర్లు, 8 మంది పారమెడికల్ స్టాఫ్, డెంటల్ విద్యార్థులు 3 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది అని అరుణ అన్నారు.

ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే డాక్టర్లకు కరోనా సోకుతోందని ఆమె అన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు పీపీఈ కిట్స్, మాస్కులు అందుబాటులో లేవు.

పరీక్షలు చేయటం, పీపీఈ, మాస్కులు ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైంది. మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎటు పోయాయో ప్రభుత్వం చెప్పాలి అని అరుణ డిమాండ్ చేశారు.

Related posts

వోట్ బ్యాంకు:టీఆర్​ఎస్​ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష

Satyam NEWS

ఉద్యమ నాయకులను బూటు కాళ్లతో తన్నిస్తుంటే ఎలా రావాలి?

Satyam NEWS

మాట ఇవ్వడం.. మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

Bhavani

Leave a Comment