23.2 C
Hyderabad
May 7, 2024 19: 09 PM
Slider ముఖ్యంశాలు

నీటి అన్యాయంపై నోరు మెదపని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి

#KrishnaRiver

కృష్ణ నది నీటిలో తెలంగాణ కు అన్యాయం జరుగుతున్నదని, తెలంగాణ వాటా వినియోగించుకోవడానికి తక్షణమే వెల్టూర్- గుoదిమళ్ళ  బ్యారేజ్ నిర్మించాలని వెల్టూరు- గుoదిమళ్ళ సాధన సమితి నాయకులు మదాసి కురువ పెద్ద మల్లయ్య, పెరుమాళ్ళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

గురువారం చిన్నంబావి మండలం వెల్టూరు  దగ్గర కృష్ణా నది తీర ప్రాంతం సందర్శించిన వారు మాట్లాడుతూ  తెలంగాణలో  కృష్ణానది నీటి వాటాలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా లో మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని అన్నారు.

అసెంబ్లీలో చర్చించలేని ఎమ్మెల్యేలు

వచ్చే అసెంబ్లీ సమావేశాలో దక్షిణ తెలంగాణ నీటి ప్రాజెక్టుల పురోగతి పై జరుగుతున్న అన్యాయం గురించి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణా నది నీటిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపుల కన్నా అధికంగా వాడుకుంటోందని, పైగా అదనపు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తుందని వారన్నారు.

ఈ అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు . కృష్ణా నది పరివాహక ప్రాంతం  ఉమ్మడి జిల్లాలో  200  కిలోమీటర్లు ప్రవహిస్తున్నా నికర జలాలను, వరద జలాలను వాడుకోవడం లో వెనకబడి ఉన్నా మనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ తెలంగాణపై టీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వం

వరద వస్తున్న క్రమంలో వరద జలాలు లెక్కకు మించి ఎన్ని టీఎంసీలు అయినా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ అందుకు తగ్గ  నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు లేక  రైతుల పంటలు ఎండుతున్నాయని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ వాదం తో  రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిలో అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నా తెలంగాణ మాత్రం తమకు కేటాయించిన వాటా నీటిని సైతం వాడు కోలేని  స్థితిలో ఉందని ఈ అంశంపై ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 మంది  టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడలేని దుస్థితి నెలకొందని వారన్నారు.

కళ్లు తెరవకపోతే దక్షిణ తెలంగాణ ఎడారే

కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న  లీడర్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇలాగే మౌనం దాలిస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి వస్తుందని వారన్నారు.

అందుకే వెల్టూరు- గుoడిమల్ల బ్యారేజ్ నిర్మించి కృష్ణానదిలో చిట్టచివరి వరద ప్రవాహాన్ని సైతం వాడుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాబ్లీ ప్రాజెక్టు మాదిరిగా బ్యారేజీ నిర్మించి జులై నుండి అక్టోబర్ వరకు నదీ ప్రవాహాన్ని గేట్లు తెరిచి ఉంచి  అక్టోబర్ తర్వాత నదిలో గేట్లు మూయడం ద్వారా నిలిచిపోయే  నీరు వాడుకోవచ్చునని అన్నారు.

అలా చేస్తే  ఇక్కడ సుమారు 30 నుంచి 40 టీఎంసీల నీటిని నిల్వచేసుకొని తెలంగాణ వాటాగా వాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు.  ఉమ్మడి జిల్లా లో కృష్ణా నది మక్తల్ నుండి వెల్టూర్ వరకు 120కిలోమీటరు మేర నిరంతరం నీటి నిల్వ ఉండి మరో కాళేశ్వరాన్ని తలపిస్తుందని వారన్నారు.

మంత్రులు నోళ్లు తెరవాలి

ఉమ్మడి జిల్లా లో శ్రీశైలం నిర్వాసిత తాలూకా లైన  కొల్లాపూర్, ఆలంపూర్ , గద్వాల ,వనపర్తి ప్రాంతాలో సాగు ,త్రాగు నీటి ప్రయోజనాలు కాపాడాలని,  కృష్ణా నది నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఈ విషయంపై అసెంబ్లీలో గళమెత్తి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మద్దూరు నాగరాజు, పేరుమల్ల తిరుపతి, కుమార్, వివిధ గ్రామాల నిర్వాసిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కౌంటర్ ఎటాక్: బుద్ధి లేకుండా మాట్లాడుతున్న పృధ్వీ

Satyam NEWS

బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం

Bhavani

ప్రీతి మృతికి నిరసనగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

Leave a Comment